భూ హక్కు - భూ రక్షపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ .. జనవరికి డెడ్‌లైన్

Siva Kodati |  
Published : Oct 17, 2023, 04:53 PM IST
భూ హక్కు - భూ రక్షపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ .. జనవరికి డెడ్‌లైన్

సారాంశం

వచ్చే ఏడాది జనవరి నాటికి మూడో దశ సర్వే పూర్తి కావాలని.. భూ హక్కు - భూ రక్షపై కేబినెట్ సబ్ కమిటీ నిర్దేశించింది . దేశంలోనే అత్యంత వేగంగా సమగ్ర సర్వే మన రాష్ట్రంలోనే జరుగుతోందని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది.  

వచ్చే ఏడాది జనవరి నాటికి మూడో దశ సర్వే పూర్తి కావాలని.. భూ హక్కు - భూ రక్షపై కేబినెట్ సబ్ కమిటీ నిర్దేశించింది. ఏపీ సచివాలయంలో పథకం అమలు తీరుపై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు సమీక్షించారు. దేశంలోనే అత్యంత వేగంగా సమగ్ర సర్వే మన రాష్ట్రంలోనే జరుగుతోందని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. రెండు దశల్లో ఇప్పటి వరకు 4 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసి భూ హక్కు పత్రాలను కూడా పంపిణీ చేశారు . రాష్ట్ర వ్యాప్తంగా 13, 072 గ్రామాల్లో డ్రోన్ క్లెయిమ్ పూర్తయ్యింది. భూ హక్కు- భూ రక్ష అమలు తీరును కేంద్ర అధికారులతో పాటు ఐదు రాష్ట్రాల నుంచి సర్వే విభాగ కమీషనర్లు రాష్ట్రంలో పర్యటించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న విధానం పరిశీలించి.. సర్వే పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం