
మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో తనకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు చిలకలూరిపేట ఎమ్మెల్యే (chilakaluripet mla) విడదల రజనీ (vidadala rajini) . ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ బీసీ మహిళనైన తనకు అవకాశం ఇచ్చి, ఎమ్మెల్యేని చేసి శాసనసభలో అడుగుపెట్టేలా చేశారని రజనీ అన్నారు. ప్రతి విషయంలో తనకు ప్రోత్సాహం కల్పించారని రజనీ చెప్పారు. తొలిసారి ఎమ్మెల్యేనైన తనకు మంత్రి పదవి లాంటి పెద్ద బాధ్యతను అప్పగించిన జగన్ నమ్మకాన్ని వమ్ము చేయనని ఆమె స్పష్టం చేశారు. వైసీపీని పటిష్టం చేయడానికి కష్టపడి పనిచేస్తానని రజనీ తెలిపారు. మంత్రి పదవి దక్కుతుందని కలలో కూడా అనుకోలేదని.. జగన్ సర్‌ప్రైజ్ చేశారని ఆమె అన్నారు. రాజకీయాల్లో వున్నంత వరకు జగన్ వెన్నంటే వుంటామని రజనీ స్పష్టం చేశారు.
అంతకుముందు .. తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించడం పట్ల వైసీపీ (ysrcp) అధినేత, సీఎం జగన్‌కు (ys jagan) ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ (gudivada amarnath) కృతజ్ఞతలు తెలిపారు. మంత్రివర్గంలో తన పేరు ఖరారైన తర్వాత గుడివాడ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ప్రారంభించిన నాటి నుంచి అధికారంలోకి వచ్చే వరకు జగన్ పడిన కష్టం అంతా ఇంతా కాదన్నారు. విశాఖ ఉమ్మడి జిల్లాలో ఐదేళ్ల పాటు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించానని తెలిపారు.
2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని అమర్‌నాథ్ వెల్లడించారు. తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా జగన్ కింద ఒక సైనికుడిగా పనిచేస్తానని గుడివాడ చెప్పారు. తన చివరి రక్తపు బొట్టు వరకు వైసీపీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. జగన్ చేసే ప్రతి పోరాటంలో తాను, తన కుటుంబం భాగస్వాములై వుంటామని గుడివాడ వెల్లడించారు. అనకాపల్లి (anakapalle mla) ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని అమర్‌నాథ్ వెల్లడించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్‌లో కొత్త మంత్రుల జాబితాను సీఎం జగన్ ఫైనల్ చేశారు. ఈ మేరకు మీడియాకు అధికారికంగా విడుదల చేశారు. 25 మందితో కొత్త టీమ్‌ను జగన్ ఎంపిక చేశారు.
ఏపీ సీఎం కొత్త టీమ్ ఇదే
1.ధర్మాన ప్రసాదరావు,
2.సీదిరి అప్పలరాజు
3.బొత్స సత్యనారాయణ
4.గుడివాడ అమర్ నాథ్
5.సి. రాజన్నదొర
6.తాడిశెట్టి రాజా
7.చెల్లుబోయిన వేణుగోపాల్
8.బూడి ముత్యాలనాయుడు
9.నారాయణస్వామి
10.ఉషశ్రీచరణ్
11.విశ్వరూప్
12.జోగి రమేష్
13.అంబటి రాంబాబు
14.మేరుగ నాగార్జున
15.బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
16.పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి
17.కారుమూరి నాగేశ్వరరావు
18.కొట్టు సత్యనారాయణ
19.కళావతి
20.అంజద్ భాషా
21.తానేటి వనిత
22.గుమ్మనూరు జయరాం
23.తిప్పేస్వామి
24. ఆర్. కే. రోజా