ముగిసిన ఏపీ కేబినేట్...నిర్ణయాలివే

Published : Sep 06, 2018, 08:05 PM ISTUpdated : Sep 09, 2018, 12:02 PM IST
ముగిసిన ఏపీ కేబినేట్...నిర్ణయాలివే

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి-యువనేస్తం పథకానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 14 నుంచి ఆన్ లైన్లో యువనేస్తం రిజిస్ట్రేషన్ల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. సీఎం-యువ నేస్తం పేరుతో అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగ భృతి అమలు చేయాలని నిర్ణయించింది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి-యువనేస్తం పథకానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 14 నుంచి ఆన్ లైన్లో యువనేస్తం రిజిస్ట్రేషన్ల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. సీఎం-యువ నేస్తం పేరుతో అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగ భృతి అమలు చేయాలని నిర్ణయించింది. 

అలాగే అన్ని మున్సిపాల్టీల్లో బీపీఎస్ అమలును ఆమోదించింది. పబ్లిక్ హెల్త్ వర్కర్స్‌కు 151 జీఓ ప్రకారం వేతనాలు చెల్లించాలని నిర్ణయించింది. దీంతో 30 వేల మందికి వేయి నుంచి రెండు వేల రూపాయల వరకూ జీతం పెరగనుంది. ఆర్య వైశ్యుల కార్పొరేషన్‌ ఏర్పాటుతో పాటు అభివృద్ధికి రూ. 30 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. బిల్డింగ్ ప్లీనైజ్డ్ స్కీమ్‌ అమలుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. మరోవైపు వీఆర్ఏలకు రూ.300 డీఏ పెంపునకు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

మరోవైపు గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై ప్రభుత్వం నియమించిన సీవై సోమయాజులు కమిషన్ నివేదికపై కేబినేట్ లో చర్చించారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై ఈ కమిటీ విచారించింది. ఒకేముహూర్తానికి పుష్కర స్నానం చెయ్యాలన్నసెంటిమెంట్ తోనే తొక్కిసలాట జరిగిందని కమిటీ తన నివేదికలో పొందుపరచింది. అయితే సోమయాజుల కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కేబినేట్ నిర్ణయం నిర్ణయం తీసుకుంది. 
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే