వైఎస్ జగన్ ఆర్థిక నేరస్థుడు: మంత్రి అయ్యన్నపాత్రుడు

By rajesh yFirst Published Sep 6, 2018, 7:39 PM IST
Highlights

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు నిప్పులు చెరిగారు. జగన్ ఆర్థిక నేరస్థుడంటూ ఘాటుగా విమర్శించారు. ఆర్ధిక నేరాలకు పాల్పడి 14 నెలలు జైల్లో ఉన్న జగన్‌ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వ్యక్తిలా ఊరేగుతున్నారని మండిపడ్డారు. 

విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు నిప్పులు చెరిగారు. జగన్ ఆర్థిక నేరస్థుడంటూ ఘాటుగా విమర్శించారు. ఆర్ధిక నేరాలకు పాల్పడి 14 నెలలు జైల్లో ఉన్న జగన్‌ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వ్యక్తిలా ఊరేగుతున్నారని మండిపడ్డారు. హంతకులు, దోపిడీదారులకు ఊరేగింపులు చేసే పరిస్థితికి రాజకీయాలను తీసుకొచ్చిన జగన్‌కు విలువలపై మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు.  

మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో శాసనసభ సమావేశాలకు హాజరుకామని చెప్పడం జగన్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని అయ్యన్న ఆరోపించారు. 

పాదయాత్రలో జగన్‌ ఇస్తున్న హామీలు అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జె ట్ కాదు భారతదేశ బడ్జెట్ కూడా సరిపోదని ఎద్దేవా చేశారు. అమలుకు సాధ్యం కానీ హామీలతో జగన్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 
 

click me!