ప్రారంభమైన ఏపీ కేబినెట్: కీలక అంశాలపై చర్చ

By narsimha lodeFirst Published Jan 21, 2022, 12:16 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్  ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన శుక్రవారం నాడు భేటీ అయింది. ఈ సమావేశంలో  కీలక విషయాలపై చర్చించనున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు ప్రారంభమైంది. కరోనా పరిస్థితులు, నియంత్రణపై కేబినెట్ లో చర్చించనున్నారు.ప్రభుత్వ ఉద్యోగుల కొత్త prc కి ఆమోదం తెలపనంది కేబినెట్.ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపుకి ఆమోదం తెలపనుండి కేబినెట్.  కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య నియామకాలపై ఆమోదం తెలపనుంది.

ప్రభుత్వ Employees ఇళ్ల పథకానికి కూడా Andhra pradesh Cabinet కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లలో 10 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయింపు విషయమై కేబినెట్ లో చర్చించనున్నారు.ఉద్యోగులకు 20 శాతం రిబెట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాటులు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
ఈబీసీ నేస్తం అమలుకు  కేబినెట్ లో అనుమతి  ఇవ్వనుంది. పెన్షన్లను 2,250 నుండి 2500కి పెంచిన ఉత్తర్వులను  కేబినెట్ ఆమోదించనుంది.
 

click me!