బస్సులో అమ్మాయితో పరిచయం.. ప్రేమ నిరాకరించిందని.. ఆ యువకుడు చేసిన పని..

Published : Jan 21, 2022, 10:56 AM IST
బస్సులో అమ్మాయితో పరిచయం.. ప్రేమ నిరాకరించిందని.. ఆ యువకుడు చేసిన పని..

సారాంశం

 రోజూ బస్సులో collegeకు వెళ్లి వచ్చే క్రమంలో పరిచయమైన విద్యార్థిని పట్ల వరుణ్ యాదవ్ love పెంచుకున్నాడు. అయితే అతని ప్రేమను ఆమె నిరాకరించడంతో మనస్థాపానికి గురయ్యాడు. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లి వస్తానని తల్లితో చెప్పి బయలుదేరిన వరుణ్ యాదవ్.. రొళ్ల సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న గోవిందప్ప బావి వద్ద చింత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

అనంతపురం :  చదువుకునే వయసులో ప్రేమ, తెలిసీ తెలియని వయసులో ఆకర్షణను ప్రేమ అనుకుని.. దాన్ని కాదన్నందుకు ప్రాణాలు తీసుకున్నాడో teenage యువకుడు. తనే పంచప్రాణాలుగా బతుకుతున్న తల్లికి గర్భశోకం మిగిల్చాడు. 

love failure కావడంతో ఓ విద్యార్థి suicide చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురంలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రొళ్ల మండలం జిజి హట్టి గ్రామానికి చెందిన వరుణ్ యాదవ్ (17)… మడకశిరలోని ఓ ప్రైవేటు కళాశాలలో Inter second yearచదువుతున్నాడు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న తల్లి అమ్మజక్క అతి కష్టంపై కుమారుడిని చదివించుకుంటోంది.

చదువుకోసం రోజూ బస్సులో collegeకు వెళ్లి వచ్చే క్రమంలో పరిచయమైన విద్యార్థిని పట్ల వరుణ్ యాదవ్ love పెంచుకున్నాడు. అయితే అతని ప్రేమను ఆమె నిరాకరించడంతో మనస్థాపానికి గురయ్యాడు. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లి వస్తానని తల్లితో చెప్పి బయలుదేరిన వరుణ్ యాదవ్.. రొళ్ల సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న గోవిందప్ప బావి వద్ద చింత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

సమాచారం అందుకున్న మడకశిర సీఐ శ్రీరామ్, గుడిబండ ఎస్ ఐ సురేష్ అక్కడికి చేరుకుని ఘటనా స్థలిని పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే భర్త నిరాదరణకు గురై.. ఉన్న ఒక్కగానొక్క కుమారుడి ఉజ్వల భవిష్యత్తు కోసం పరితపించిన తల్లి విలపించిన తీరు అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. 

ఇదిలా ఉండగా ఇలాంటి ఘటనే.. జనవరి 8న హైదరాబాద్  మారేడు పల్లిలో చోటు చేసుకుంది. ప్రేమలో ఫెయిల్ అయ్యాననే బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోని ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ సంఘటన మారేడుపల్లి పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే...  మారేడుపల్లి సెకండ్ లక్ష్మీ నగర్ బస్తీలో నివాసమంటున్న రవి చైతన్య(21) బేగంటలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.  

రవి, గత కొంతకాలంగా మారేడుపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే... ఇటీవల ఆ యువతికి అతనికి దూరమైంది. ప్రేమ విఫలం కావడంతో మనస్థాపానికి గురైన రవిచైతన్య సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు బయటి నుంచి వచ్చి తలుపులు తెరిచిచూడగా రవి కొన ఊపిరితో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. 

చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రేమ విఫలం కావడంతో రవిచైతన్య ఉరేసుకుని మృతి చెంది ఉండవచ్చునని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, రవి ప్రేమించిన అమ్మాయి ఎందుకు దూరం అయ్యింది. ఇంట్లో వద్దన్నారా? లేక అతనిది వన్ సైడ్ లవ్వా? అసలు ఆ యువతి రవి ప్రేమను అంగీకరించిందా లేదా? అనే అనుమానాలు అక్కడి స్థానికులు వెలిబుచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna Reddy Sensational Comments On Localbody Elections 2026 | Asianet News Telugu
విద్యార్థుల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. త‌ల్లికి వంద‌నం రెండో విడ‌త నిధుల‌పై కీల‌క అప్‌డేట్