మూడు రాజధానులపై ఏపీ కేబినెట్ సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. మూడు రాజధానులపై జగన్ సర్కార్ వెనక్కి తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.
అమరావతి: మూడు రాజధానులపై చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకొనేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం నాడు భేటీ అయింది. ఇవాళ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది,. ఈ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకొన్నారు. మూడు రాజధానుల చట్టానికి న్యాయ పరమైన ఇబ్బందులు తొలగించేందుకు కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి వీలుగా ఏపీ సర్కార్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకొందనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే ys jagan సర్కార్ ap high court ఏం చెబుతుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
undefined
three capitals అంశానికి సంబంధించి న్యాయ పరమైన చిక్కుల గురించి ఏపీ రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ ap cabinet సమావేశంలో ప్రజేంటేషన్ ఇచ్చారు. పలు దశల్లో ఎదురైన చిక్కులను సమగ్రంగా కేబినెట్ ముందుంచారు. ప్రస్తుతం ఉన్న చట్టం యధాతథంగా అమలు చేస్తే చిక్కులు తప్పవని vijay kumar తెలిపారు. న్యాయ పరమైన ఇబ్బందులు తప్పవని ఆయన కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కారణంగానే మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసకొందా అనే చర్చ కూడా లేకపోలేదు. ఏపీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ కేబినెట్ సమావేశం చర్చించనుంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. అయితే భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను ఇవాళ్టితో ముగించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ది బిల్లు-2020 , ఏపీ సీఆర్‌డీఏ రద్దు -2020 బిల్లులకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 2020 జూలై 31న ఆమోదం తెలిపారు. శాసనమండలికి రెండు దఫాలు పంపిన తర్వాత నెల రోజుల గడువు పూర్తైతే అలాంటి బిల్లులు ఆమోదం పొందినట్టే పరిగణించాల్సి ఉంటుందంటూ ప్రభుత్వం ఇటీవల ఈ మూడు బిల్లులను ఆమోదానికి పంపింది. దీంతో గవర్నర్ ఈ మూడు బిల్లులకు ఆమోదం తెలిపారు.
అయితే మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 45 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర సాగుతుంది. నిన్న బీజేపీకి చెందిన నెల్లూరు జిల్లాలో ఈ పాదయాత్రలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. నెల్లూరు జిల్లాలో బీజేపీ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొని తమ సంఘీభావం తెలిపిన మరునాడేఏపీ సర్కార్ ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఇవాళ నిర్వహించిన కేబినెట్ అత్యవసర సమావేశంలో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులపై చేసిన చట్టాలను వెనక్కి తీసుకొంది.