రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లును కేబినెట్ రద్దు చేసినట్టుగా అడ్వొకెట్ జనరల్ ఎస్ శ్రీరామ్ ఏపీ హైకోర్టుకు (AP High Court) తెలిపారు. ఈ క్రమంలోనే మూడు రాజధానుల బిల్లు (Three capital Bill) ఉపసంహరణకు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh government) మూడు రాజధానుల బిల్లు (Three Capital Bill) సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లును కేబినెట్ రద్దు చేసినట్టుగా అడ్వొకెట్ జనరల్ ఎస్ శ్రీరామ్ ఏపీ హైకోర్టుకు (AP High Court) తెలిపారు. ఇందుకు సంబంధించి మరికాసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. ఈ క్రమంలోనే మూడు రాజధానుల ఉపసంహరణపై తీవ్ర చర్చ సాగుతుంది. వైఎస్ జగన్ (YS Jagan) అసెంబ్లీలో ఎటువంటి ప్రకటన చేస్తారు..?, ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది..? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
Also read: మూడు రాజధానులపై జగన్ సర్కార్ వెనక్కి: హైకోర్టుకు ఏపీ ప్రభుత్వ అఫిడవిట్
ఈ క్రమంలోనే మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణకు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా రాయల చెరువు వద్ద మీడియాలో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి..ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం చేసిందో తనకు ఐడియా లేదన్నారు. లీగల్, టెక్నికల్ ఇష్యూ కోసమే ఇలా చేసి ఉంటున్నారని తాను అనుకుంటున్నట్టుగా చెప్పారు.
చట్టం ఉపసంహరణ ఇంటర్వెట్ మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. శుభం కార్డు పడేందుకు మరింత సమయం ఉందన్నారు. సాంకేతిక సమస్యలు సరిద్దిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ అని పేర్కొన్నారు. తాను ఇప్పటికి మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదు అని వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల పాదయాత్ర లక్షల మందితో సాగుతోందా అని ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్ర అనేది పెయిడ్ ఆర్టిస్టుల పాదయాత్ర అని ఆరోపించారు. రైతుల పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదని ఆయన అన్నారు.
హైకోర్టులో అడ్వొకెట్ జనరల్ ఏం చెప్పారంటే..?
రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లును కేబినెట్ రద్దు చేసినట్టుగా అడ్వొకెట్ జనరల్ ఎస్ శ్రీరామ్ ఏపీ హైకోర్టుకు (AP High Court) తెలిపారు. సీఎం వైఎస్ జగన్.. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి ముసాయిదా బిల్లులను కూడా ప్రవేశపెట్టబోతున్నారని చెప్పారు. దీనికి కారణాలు ఏమిటి..?, ఉద్దేశాలు ఏమిటి..?, అభ్యంతరాలు ఏమిటి..? అనే వాటిపై బిల్లు కాపీని మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టుకు సమర్పించనున్నట్టుగా చెప్పారు.