జనసేనతోనే వున్నాం.. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ : తేల్చేసిన సోము వీర్రాజు

Siva Kodati |  
Published : Jul 05, 2022, 04:42 PM IST
జనసేనతోనే వున్నాం.. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ : తేల్చేసిన సోము వీర్రాజు

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొనకపోవడంపై జరుగుతున్న ప్రచారానికి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తెరదించారు. జనసేనతో కలిసే వున్నామని ఆయన స్పష్టం చేశారు. 

జనసేన (janasena party) బీజేపీతో (bjp) కలిసే వుంటుందన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) . వచ్చే ఎన్నికల్లో కలిసి పోటి చేస్తామని తెలిపారు. ప్రధాని సభకు పవన్ కల్యాణ్ (pawan kalyan) హాజరుకాకపోవడంపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు వీర్రాజు. ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాల్సిందిగా జనసేన శ్రేణులకు వీడియో సందేశం ద్వారా పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి పర్యటన జయప్రదం అయ్యిందని.. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుంటోందని వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందని.. ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

అంతకుముందు ... మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆగస్టు 2 నుంచి 15 వరకు జరగనున్న యువ సంఘర్షణ యాత్రకు సంబంధించిన పోస్టర్ , లోగోలను వీర్రాజు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారంటూ దుయ్యబట్టారు. టీచర్స్, పోలీసు విభాగాల్లో ఖాళీలు భర్తీ చేస్తాం‌నని.. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని చెప్పారంటూ వీర్రాజు మండిపడ్డారు. అన్ని వర్గాల వారికి నేనున్నా అని చెప్పి ఓట్లు వేయించుకున్నారని ఆయన గుర్తు చేశారు.

ALso Read:నేనున్నానని చెప్పి.. అందరితో ఓట్లు, చివరికి మోసం: జగన్‌పై సోము వీర్రాజు ఆగ్రహం

యువ మోర్చా ఆధ్వర్యంలో నాలుగు జోన్లలో యాత్ర చేపట్టారని.. మా పార్టీ పరంగా మేము కార్యక్రమాలు చేసుకునే హక్కు ఉందని సోము వీర్రాజు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది నిరసన కార్యక్రమం కాదని.. అనుమతి ఇస్తారనే మేము భావిస్తున్నామన్నారు. ప్రధాని పర్యటన లో‌ నల్ల బెలూన్లు ఎగురవేయడం సరైన విధానం కాదని వీర్రాజు హితవు పలికారు. మోడీ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారని.. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివాసీల గురించి మాత్రమే మోడీ మాట్లాడారని.. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో‌ చూడటం సరి కాదని సోము వీర్రాజు హితవు పలికారు. 

కొంతమంది షడన్ గా పుట్టుకొచ్చి మేధావులుగా మాట్లాడతారని.. అటువంటి వారి మాటలను మేము పట్టించుకోమని చురకలు వేశారు. సబ్ కా సాత్, సబ్ కా‌ వికాస్ అనేది మోడీ మంత్రమని.. ఎపి లొ కొంతమంది కి అధికారమే కావాలని, అభివృద్ధి అక్కర్లేదంటూ సోము పేర్కొన్నారు. బిజెపి కి అభివృద్ధి కావాలి..‌ ప్రత్యామ్నాయ శక్తి గా ఎపిలో ఎదుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఎపి లో రెండో‌ కోటా రేషన్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసిందని.. పేదల పక్షాన బిజెపి ఉద్యమం‌ చేస్తుందన్నారు. విద్య, వైద్యానికి బిజెపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని... కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా  ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని వీర్రాజు హామీ ఇచ్చారు. 

రాష్ట్రం లో జాతీయ రహదారులు బాగున్నా.. రాష్ట్ర రహదారులు అధ్వానంగా ఉన్నాయంటూ దుయ్యబట్టారు. ఈ రాష్ట్ర రహదారులు నిర్వహణ బాధ్యత యువకులకు అప్పగిస్తామని, మొక్కలు పెంచి..‌వాటిని సంరక్షించడం ద్వారా నిరుద్యోగ యువతకు అవకాశం ఇస్తామని సోము వీర్రాజు తెలిపారు. తెలంగాణ, ఎపి లలో‌ బిజెపి అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తామని.. జాతీయ సమావేశాలలో కూడా  భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించామని ఆయన పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు