చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రానికి చెందిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఏపీ అసెంబ్లీ కమిటీ పెగాసెస్ పై నియమించిన హౌస్ కమిటీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై అవసరమైతే కొందరిని సభా సంఘం ముందుకు పిలుస్తామన్నారు.
హైదరాబాద్:Pegasus Spyware పై ఏర్పాటు చేసిన ఏపీ అసెంబ్లీ సభాసంఘం మంగళవారం నాడు సమావేశమైంది. సభాసంఘం చైర్మెన్ Bhumana Karunakar Reddy నేతృత్వంలో కమిటీ ఇవాళ AP Assembly లో కమిటీ హాల్ లో సభా సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హొంశాఖ, ఐటీ, ఆర్జీటీఎస్ అధికారులు కూడా హాజరయ్యారు. 2016-19 మధ్య అప్పటి ప్రభుత్వం వ్యక్తుల సమాచారం సేకరించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిందని హౌస్ కమిటీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
గత ప్రభుత్వం వ్యక్తుల ప్రైవేట్ భద్రతకు ముప్పు వాటిల్లేలా చేసిందన్నారు. రెండు రాష్ట్రాల్లో Data చౌర్యం ఉందన్నారు. అందుకే గతంలో Telangana సర్కార్ దర్యాప్తు జరిపిందని ఆయన గుర్తు చేశారు. అవసరమైతే కొందరిని హౌస్ కమిటీ ముందుకు పిలుస్తామన్నారు.పెగాసెస్ అంశంపై భూమన కరుణాకర్ రెడ్డి చైర్మెన్ గా అసెంబ్లీ హౌస్ కమిటీని ని ఏర్పాటు చేసింది ఏపీ అసెంబ్లీ.
undefined
ఈ విషయాన్ని అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ ఏడాది మార్చి 25న ప్రకటించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారని బెంగాల్ సీఎం చేసిన ప్రకటనపై ఏపీ అసెంబ్లీలో చర్చించారు. సభా కమిటీని ఏర్పాటు చేయాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో ఏపీ అసెంబ్లీ పెగాసెస్ పై హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ కమిటీకి భూమన కరుణాకర్ రెడ్డిని చైర్మెన్ గా నియమించారు. కమిటీలో శ్రీమతి కొత్తపల్లి భాగ్యలక్ష్మిగుడివాడ అమర్ నాథ్,అబ్యయ్య చౌదరి,కొలుసు పార్ధసారథి,మెరుగు నాగార్జున, మద్దాలి గిరిధర్ లను సభ్యులుగా నియమించారు. ఈ ఏడాది జూ్ 14న తొలిసారిగా కమిటీ సమావేశం జరిగింది.
ఈ కమిటీకి భూమన కరుణాకర్ రెడ్డిని చైర్మెన్ గా నియమించారు. కమిటీలో శ్రీమతి కొత్తపల్లి భాగ్యలక్ష్మిగుడివాడ అమర్ నాథ్,అబ్యయ్య చౌదరి,కొలుసు పార్ధసారథి,మెరుగు నాగార్జున, మద్దాలి గిరిధర్ లను సభ్యులుగా నియమించారు. ఈ ఏడాది జూ్ 14న తొలిసారిగా కమిటీ సమావేశం జరిగింది.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ప్రత్యర్ధులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే 2019 మే వరకు రాష్ట్రంలో ఎలాంటి పెగాసెస్ స్పైవేర్ తో పాటు ఇతర స్పైవేర్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించలేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు గతంలోనే ప్రకటించారు.పెగాసెస్ సహా ఎలాంటి సాప్ట్ వేర్ ను కూడా కొనుగోలు చేయలేదని అప్పటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా గతంలోనే ప్రకటించారు. పెగాసెస్ సంస్థ తమను సంప్రదించిందన్నారు. కానీ తమ ప్రభుత్వం ఎలాంటి సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయలేదన్నారు.
వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షలు చేసిందన్నారు. పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి తెలియకుండా ఉంటుందా అని లోకేష్ ప్రశ్నించారు. తమపై తప్పుడు ప్రచారం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని లోకేష్ చెప్పారు. అమరావతి భూముల విషయంలో కూడా ఇదే రకంగా వైసీపీ తప్పుడు ప్రచారం చేసిందని లోకేష్ గుర్తు చేశారు.