
రాయలసీమ జిల్లాల్లో ఎయిర్‌పోర్టులకు సంబంధించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హత్యలు చేసిన వారి జిల్లాలకు ఎయిర్‌పోర్టులా అంటూ నిన్న విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో సోమువీర్రాజు వ్యాఖ్యానించడంపై రాయలసీమ జిల్లాలకు చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదం ముదురుతుండటంతో సోము వీర్రాజు వివరణ ఇచ్చారు. వివేకా హత్యను దృష్టిలో వుంచుకునే తాను అలా మాట్లాడానని ఆయన అన్నారు. కడప ప్రజలకు హత్యా రాజకీయాలకు సంబంధం లేదని సోము వీర్రాజు పేర్కొన్నారు.
కాగా.. కొత్త Districts ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చిందని Somu Veerraju ప్రశ్నించారు. గురువారం నాడు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై రెండున్నర ఏళ్లు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రతి జిల్లాకు ఒక కమిటీ ఏర్పాటు చేసి అభిప్రాయాన్ని సేకరించాలని ఆయన కోరారు.చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలే తమ పార్టీ విధానమని సోము వీర్రాజు చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గం వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని తాము గతంలోనే చెప్పామన్నారు. జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే జిన్నా టవర్ ను అబ్దుల్ కలాం టవర్ గా పేరు మార్చాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో Temple విధ్వంసకారులపై చర్యలేవని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అల్లకల్లోలం సృష్టిస్తోందని వైసీపీ చేస్తున్న విమర్శలు అర్ధరహితమన్నారు. Ycp క్యాసినో పార్టీ అంటూ ఆయన మండిపడ్డారు. గుడివాడకు వెళ్తే మీకు భయమెందుకని ఆయన వూసీపీ నేతలను ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్లపై తిరిగే పరిస్థితి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ను మోడీ ప్రభుత్వమే అభివృద్ది చేస్తోందన్నారు. Employees డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.