తెరపైకి ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం డిమాండ్ .. ధర్మాన అభిప్రాయమా, ప్రభుత్వ నిర్ణయమా: బీజేపీ నేత విష్ణువర్థన్

By Siva KodatiFirst Published Jan 11, 2023, 4:57 PM IST
Highlights

అమరావతినే రాజధానిగా ఉంచేట్లయితే ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి కౌంటరిచ్చారు. దోపిడీ కోసమే విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని కోరుతున్నారా అని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. 

అమరావతినే రాజధానిగా ఉంచేట్లయితే ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. ధర్మాన ప్రత్యేక రాష్ట్రం అడగటం వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ నిర్ణయమా, లేక ధర్మాన వ్యక్తిగత అభిప్రాయమా అన్నది చెప్పాలని విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ ధర్మాన అభిప్రాయమే అయితే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ధర్మాన ఏం చేశారో చెప్పాలని విష్ణువర్థన్ రెడ్డి నిలదీశారు. జగనన్న తోడు అనేది కేంద్ర పథకమని ఆయన ఎద్దేవా చేశారు. దోపిడీ కోసమే విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని కోరుతున్నారా అని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. ఈ నెల 23, 24 తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను భీమవరంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

అంతకుముందు మంగళవారం ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు  చేశారు. అమరావతిని రాజధానిగా చేస్తే తమ రాష్ట్రం అక్కడ ఉండకూడదని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్‌లో సీసీ రోడ్డును మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..  ఉత్తరాంధ్ర ప్రజల కోసం గొంతెత్తడం ఆపనని చెప్పారు. తన ప్రాంత ప్రజల కోసం ఎక్కడివరకైనా వెళ్తానని తెలిపారు. అధికార పార్టీ అన్యాయం చేసినా ఊరుకోనని స్పష్టం చేశారు. 

Latest Videos

ALso Read: ఒకే రాజధాని అమరావతి అయితే.. మా రాష్ట్రం అక్కడ ఉండకూడదు: మంత్రి ధర్మాన ప్రసాదరావు

‘‘చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతినే రాజధాని చేస్తామని అంటారు. ఒకే రాజధాని అమరావతిలో పెట్టుకుంటే దానిపై మాకేం అభ్యంతరం లేదు. కానీ మా రాష్ట్రం అక్కడ ఉంటే మాత్రం మేము ఒప్పుకోం. విశాఖపట్నం ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందే. శ్రీకాకుళంలో రూ.కోటి ఖర్చుతో రోడ్డు వేస్తేనే అందరూ ఇంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 80 ఏళ్ల తర్వాత ఈ పరిస్థితులు శ్రీకాకుళంలో ఉన్నప్పటికీ నోర్మూసుకుని ఉంటే మేము అసెంబ్లీకి ఎందుకు వెళ్లాలి?. ప్రభుత్వంలో ఎందుకు ఉండాలి?’’ అని ధర్మాన ప్రసాదరావు అన్నారు. 

click me!