గుంటూరు డీఎంహెచ్‌వోపై బదిలీ వేటు వేసిన కలెక్టర్.. కారణమిదే

By Siva KodatiFirst Published Jan 11, 2023, 3:21 PM IST
Highlights

గుంటూరు డీఎంహెచ్‌వో సుమయా ఖాన్‌పై బదిలీ వేటు వేశారు జిల్లా కలెక్టర్. జిల్లా పాలనాధికారి అనుమతి లేకుండా 40 మందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో సుమయాఖాన్‌పై బదిలీ వేటు పడింది. 

గుంటూరు డీఎంహెచ్‌వో సుమయా ఖాన్‌పై బదిలీ వేటు వేశారు జిల్లా కలెక్టర్. డీఎంహెచ్‌వోను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. గతేడాది జూలై 11న విధుల్లో చేరిన సుమయా ఖాన్ జిల్లా పాలనాధికారి అనుమతి లేకుండా 40 మందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో సుమయాఖాన్‌పై బదిలీ వేటు పడింది. మరోవైపు డీఎంహెచ్‌వోగా బాధ్యతలు చేపట్టారు హనుమంరావు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!