బూతులతోనే ఫేమస్.. సంక్రాంతిని క్యాసినోగా మార్చాడు , అసెంబ్లీకి మళ్లీ పంపొద్దు : కొడాలి నానిపై సునీల్ దియోధర్

Siva Kodati |  
Published : May 17, 2023, 03:24 PM IST
బూతులతోనే ఫేమస్.. సంక్రాంతిని క్యాసినోగా మార్చాడు ,  అసెంబ్లీకి మళ్లీ పంపొద్దు : కొడాలి నానిపై సునీల్ దియోధర్

సారాంశం

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై మండిపడ్డారు ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్. నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై మండిపడ్డారు ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్. బుధవారం గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు వారికి విశిష్టత కలిగిన సంక్రాంతి పండుగను నాని క్యాసినో, క్యాబిరే డ్యాన్స్ లుగా మార్చేశారని సునీల్ దుయ్యబట్టారు. గుడివాడ యువతను సర్వనాశనం చేస్తున్న కొడాలి నాని.... జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా ప్రజలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకొస్తే కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతామని సునీల్ దియోధర్ స్పష్టం చేశారు.

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచి రాజకీయ వేడి కొనసాగుతుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వ్యుహా, ప్రతివ్యుహాలతో ఇప్పటి నుంచే రానున్న ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన టీడీపీ.. ఈసారి  ఎలాగైనా అధికారంలోకి రావాలని  ప్రణాళికలు రచిస్తుంది. మరోవైపు సంక్షేమం అజెండాగా ముందుకు సాగుతున్న  వైసీపీ.. మరోసారి అధికారాన్ని నిలుపుకునేలా పావులు కదుపుతుంది. అయితే ఇరు పార్టీలు కూడా రాష్ట్రంలోని  కొన్ని నియోజకవర్గాల్లో గెలుపును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. వై నాట్ 175 అంటున్న వైఎస్ జగన్.. కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి  తెలిసిందే. 

ALso Read: కొడాలి నాని ఓటమే లక్ష్యంగా టీడీపీ భారీ స్కెచ్.. గుడివాడ బరిలో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి..?

ఇదిలా ఉంటే.. టీడీపీ కూడా కొన్ని  నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో గుడివాడ‌ ఒకటి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని ఓటమికి వ్యుహాలు రచిస్తుంది. కొడాలి నానిపై దివంగత హరికృష్ణ, సినీ నటుడు ఎన్టీఆర్‌లకు సన్నిహితుడనే ముద్ర ఉంది. అయితే టీడీపీతో రాజకీయ జీవితం ప్రారంభించిన కొడాలి నాని.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. పదేళ్లుగా వైసీపీలోనే కొనసాగుతున్నారు. టీడీపీ నేతలపై, ముఖ్యంగా చంద్రబాబు  నాయుడు, నారా లోకేష్‌లపై విమర్శలు చేయాలంటే కొడాలి నాని ముందుంటారు. నందమూరి ఫ్యామిలీ నుంచి చంద్రబాబు పార్టీని లాక్కున్నారని ఆరోపించే నాని.. జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతుగా కూడా కామెంట్స్ చేస్తుంటారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్