బూతుల్లో అవార్డులిస్తే కొడాలి నానికే ఇవ్వాలి: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Nov 09, 2021, 04:15 PM IST
బూతుల్లో అవార్డులిస్తే కొడాలి నానికే ఇవ్వాలి: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

మంత్రి కొడాలి నానిపై (minister kodali nani) మండిపడ్డారు బీజేపీ (bjp) ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (somu verraju) . కొడాలి నాని ఓ బూతు మహారాజు అని అభివర్ణించారు. బూతులు తిట్టేవారికి ప్రత్యేకంగా అవార్డులు ఇస్తే కొడాలి నానికే ఇవ్వాలంటూ సెటైర్లు వేశారు. దే

మంత్రి కొడాలి నానిపై (minister kodali nani) మండిపడ్డారు బీజేపీ (bjp) ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (somu verraju). మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కొడాలి నాని ఓ బూతు మహారాజు అని అభివర్ణించారు. బూతులు తిట్టేవారికి ప్రత్యేకంగా అవార్డులు ఇస్తే కొడాలి నానికే ఇవ్వాలంటూ సెటైర్లు వేశారు. దేశాన్ని రక్షించే ఉద్దేశంతోనే కేంద్రం పెట్రోల్‌పై చార్జీలు విధించిందని.. అందులో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాటాలు వస్తున్నాయని సోము వీర్రాజు వెల్లడించారు.

అన్ని రాష్ట్రాలు పెట్రో ధరలు (petrol diesel price) తగ్గిస్తుంటే, ఏపీ ప్రభుత్వం (ap govt)  తగ్గించనంటుందా... ఏమిటీ వితండవాదం? జగన్ ప్రభుత్వానిదంతా పిడివాదం! అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థ పిల్లలను కొట్టినట్టు పెట్రోల్ చార్జీలు తగ్గించమంటున్న పిల్లలను కూడా కొడతారా? అంటూ సోము వీర్రాజు నిలదీశారు. దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలన చేస్తుంటే, మమ్మల్ని పెట్రోల్ పోసి తగులబెడతామంటారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్ విధానాన్ని వారంలో రద్దు చేస్తామని హామీ ఇచ్చారని... ఇచ్చిన హామీ నెరవేర్చని మిమ్మల్ని తగులబెట్టారా? అంటూ సోము వీర్రాజు ప్రశ్నించారు.

ALso Read:అల్లర్ల కోసమే పెట్రోల్ బంకుల వద్ద ధర్నాలు : బాబుపై ఫైర్, పవన్‌పై మంత్రి కొడాలి సెటైర్లు

బద్వేలులో (badvel bypoll) మాకు డిపాజిట్ కూడా దక్కలేదని ప్రచారం చేస్తున్నారని... బద్వేలు ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా ఉంటే మాకు చాలా ఓట్లు వచ్చేవి అని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. మాది తోక పార్టీ అంటున్నారని, రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ఎవరికి తోకల్లా వ్యవహరిస్తున్నారో అర్థంకావడం లేదా? అని ఆయన ప్రశ్నించారు


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?