అన్నవరం కొండపై క్వారంటైన్ సెంటర్.. చుట్టుపక్కల స్థలం లేదా..? : ఏపీ సీఎస్‌కు కన్నా లేఖ

By Siva KodatiFirst Published Apr 19, 2020, 6:35 PM IST
Highlights

రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కొండపై క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు.

రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కొండపై క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు.

ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఆయన లేఖ రాశారు. కొండపై ఉన్న హరిహరసదన్‌లో క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటుకు అక్కడి అధికారులు ప్రయత్నాలు చేయడంపై కన్నా అభ్యంతరం తెలిపారు.

Also Read:ఏపీలో విజృంభిస్తున్న కరోనా: 24 గంటల్లో 44 కొత్త కేసులు, మొత్తం 647కి చేరిక

అన్నవరం కొండ ఎంత పవిత్రమైందో అందరికీ తెలుసునని.. అక్కడ నిర్మించి సత్రాలన్నీ దాతలు, భక్తుల సహకారంతో చేపట్టినవేనని లక్ష్మీనారాయణ గుర్తుచేశారు. అన్నవరం చుట్టుపక్కల స్థలం లేనట్లుగా కొండపై క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయాలని భావించడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు.

హిందువుల నమ్మకాన్ని కించపరచాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఇదంతా చేస్తున్నట్లు అనిపిస్తోందని కన్నా ఆరోపించారు. ఈ విషయంలో కలగజేసుకోవాలని చీఫ్ సెక్రటరీని ఆయన కోరారు.

Also Read:వైఎస్ జగన్ ఇంటి సమీపంలోని అపార్టుమెంటులో మహిళ మృతి

హిందూ దేవాలయాలకు చెందిన సత్రాల్లో క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించాలని కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి  చేశారు.

మరోవైపు ఏపీలో గత 24 గంటల్లో 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 647కి చేరింది. కర్నూలు జిల్లాలో 26, కృష్ణా జిల్లాలో 6, గుంటూరులో 3, అనంతలో 3, విశాఖలో 1 కేసు నమోదైంది. 

click me!