నన్ను ఎంతలా ఏడిపించావ్: మగధీర సినిమా డైలాగ్ చెప్తూ చంద్రబాబుపై రోజా పంచ్ లు

By Nagaraju penumalaFirst Published Dec 12, 2019, 11:54 AM IST
Highlights

చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మగధీర సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుందని చెప్పుకొచ్చారు. 151 మందికి తానొక్కడినే సమాధానం చెప్తానంటూ చంద్రబాబు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రోజా.   

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నీతి, న్యాయం, ధర్మం అంటూ మాట్లాడటం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వళ్ళించినట్లు ఉందంటూ రోజా సెటైర్లు వేశారు. 

మెుదటి సారి అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత ప్రజాసమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతుంటే తనను ఏడాదిపాటు అకారణంగా సస్పెండ్ చేశారంటూ ధ్వజమెత్తారు. గతంలో తనను మార్షల్స్ తో బయటకి విసిరేశారని గుర్తు చేశారు. అసెంబ్లీ నుంచి తన సస్పెన్షన్ కరెక్ట్ కాదని సుప్రీం కోర్టు చెప్పినా చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదన్నారు.  

హైకోర్టు ఆదేశాలు ఉన్నా తనను లోపలికి రానివ్వలేదని రోజా ఆరోపించారు. నిరసన తెలుపుతున్న తనను ఈడ్చుకెళ్లి కార్లో పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు విజయవాడ కేంద్రంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంపై తాను అసెంబ్లీలో నిలదీస్తుంటే తనను అకారణంగా సస్పెండ్ చేశారని గుర్తు చేశారు రోజా.

ap assembly: చంద్రబాబుకు ఇంగ్లీష్ అర్ధం కావడం లేదేమో: జగన్ సెటైర్లు..

కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితులపై ఆనాటి సీపీ ప్రస్తుత డీజీపీ గౌతం సవాంగ్ దాడి చేస్తే 200 సీడీలు దొరికినట్లు చెప్పుకొచ్చారు. అవసరాల కోసం డబ్బులు అప్పులు తీసుకున్నవారిని బెదిరించి వ్యభిచార కూపంలోకి దించారని అలాంటి అమానుష ఘటనపై తాను అసెంబ్లీలో వాయిదా తీర్మానం పెట్టినట్లు చెప్పుకొచ్చారు.

కాల్ మనీ సెక్స్ రాకెట్ అంటే ఒక పేపర్లో కామా అని షార్ట్ కట్ లో రాశారని దాన్ని ఆసరాగా తీసుకుని తనను అసెంబ్లీ రూల్స్ కి వ్యతిరేకంగా ఏడాదిపాటు సస్పెండ్ చేశారని ఆరోపించారు. 

బూటు కాళ్లతో తన్నారు, ఐదేళ్లు బతుకుతానో చస్తానో కూడా ...: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి..

తనను ఒక మనిషిలా కాకుండా ఒక జంతువులా చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేసిన మార్షల్స్ ప్రవర్తించారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మార్షల్స్ అడ్డుకోకపోయినా రాద్ధాంతం చేస్తున్నారని అసెంబ్లీలో గట్టిగా అరుస్తున్నారంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు రోజా. గట్టిగా అరిస్తే గడ్డిపరక గర్జించే సింహం అయిపోదంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. 

ఇదే శాసన సభలో ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు గట్టిగా మాట్లాడితే ఇక్కడే పాతేస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు మరచిపోయినట్లు ఉన్నారని గుర్తు చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో తనను పాతేస్తామంటూ ఆనాడు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నప్పుడు చంద్రబాబుకు నిబంధనలు రూల్స్ ఏమైపోయాయని నిలదీశారు. 

చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మగధీర సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుందని చెప్పుకొచ్చారు. 151 మందికి తానొక్కడినే సమాధానం చెప్తానంటూ చంద్రబాబు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడా, పనికిమాలిన నాయకుడా...? అంటూ తిట్టిపోశారు. చంద్రబాబుకి వయస్సు మీదపడే కొద్దీ చాదస్తం పెరుగుతోందంటూ విమర్శించారు రోజా. చంద్రబాబు నాయుడుని ఆస్పత్రిలో చూపించాల్సిన అవసరం ఉందన్నారు. అత్యవసరంగా వైద్యం అందించాలని లేకపోతే ఇబ్బందులు తప్పవంటూ రోజా అసెంబ్లీలో హెచ్చరించారు.  

అలా చేసిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు: జగన్ పై చంద్రబాబు ఫైర్...

click me!