ap assembly: చంద్రబాబుకు ఇంగ్లీష్ అర్ధం కావడం లేదేమో.. జగన్ సెటైర్లు

By narsimha lode  |  First Published Dec 12, 2019, 11:02 AM IST

అసెంబ్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. 


అమరావతి: ఏపీ అసెంబ్లీ విపక్ష నేత చంద్రబాబుపై ఏపీ  సీఎం వైఎస్  జగన్ గురువారం నాడు సెటైర్లు వేశారు. గురువారం నాడు అసెంబ్లీలో పత్రికల గురించి విడుదల చేసిన 2430 జీవో గురించి జరిగిన చర్చ సందర్భంగా  చంద్రబాబుపై జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం నాడు 2430 జీవో చదివి విన్పించారు ఏపీ సీఎం వైఎస్ జగన్.  2430 జీవోని చంద్రబాబు చదివారా లేదా అని చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. 

Latest Videos

చంద్రబాబునాయుడు ఒక్కసారైనా ఈ జీవో చదివారా, ఈ జీవోలోని భావాన్ని చంద్రబాబునాయుడు అర్ధం చేసుకోవడంలో లోపం ఉందేమోనని ఆయన చంద్రబాబునాయుడుపై సెటైర్లు వేశారు.

చంద్రబాబుకు ఇంగ్లీష్ అర్ధం కావడంలో లోపం ఉందేమోనని ఆయన చెప్పారు. 2430 జీవో రద్దు చేయాలని చంద్రబాబునాయుడు కోరడం తనకు ఆశ్చర్యాన్ని కల్గిస్తోందన్నారు.  40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబునాయుడుకు కనీస జ్ఞానం కూడా వ్యవహరిస్తున్నారని వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. 

ఆధారాలు లేకుండా మీడియా వార్తలు రాస్తే చూస్తూ ఊరుకోవాలని అని సీఎం జగన్  విపక్ష నేత చంద్రబాబును ప్రశ్నించారు. తప్పుడు రాతలు రాస్తే వారిపై పరువు నష్టం వేసే హక్కు కూడ ఉండదా అన్నారు. ఆరోపణలు మోస్తూ అధికారులు ఉండాలా అని జగన్ ప్రశ్నించారు.
 

click me!