ఆదివారం నాటికి కేవలం రైతు బజార్లలోనే కాకుండా మార్కెట్ యార్డులలో కూడా ఉల్లిపాయలను అమ్మేలా చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు. ఇప్పటికే సమీక్షలు నిర్వహించానని ఆదివారం నుంచి మార్కెట్ యార్డులలో ఉల్లిని అమ్మి కొనుగోలు దార్లకు ఇబ్బందులు లేకుండా చూస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
అమరావతి: దేశంలోనే ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం ఉల్లిపాయలను సరఫరా చేస్తుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఉల్లిపాయల కోసం తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయం చూస్తుంటే బాధనిపిస్తోందన్నారు.
రైతు బజార్లలో రూ.25కే కిలో ఉల్లి అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి గర్వ పడుతున్నట్లు తెలిపారు. బీహార్ రాష్ట్రంలో కిలో రూ.35కు అమ్ముతున్నారని చెప్పుకొచ్చారు. వెస్ట్ బెంగాల్ లో రూ.55, తెలంగాణలో రూ.40, తమిళనాడులో రూ.35 , మధ్యప్రదేశ్ లో రూ.50లకు అమ్ముతుంటే తమ ప్రభుత్వం రూ.25కే వినియోగదారుడికి అందిస్తున్నట్లు తెలిపారు.
జగన్ కు కౌంటర్: హెరిటేజ్ గ్రూప్ తో మాకు సంబంధం లేదన్న నారా భువనేశ్వరి
తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క రైతు బజార్లో 25 టన్నుల ఉల్లిపాయలను వినియోగదారులకు అందించారని తమిళనాడులో 50 టన్నులు, వెస్ట్ బెంగాల్ లో నేటి నుంచి అందుబాటులోకి తెస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 29 నుంచి ఇప్పటి వరకు 38,496 క్వింటాళ్ల ఉల్లిని అందించిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు.
రైతు బజార్ల దగ్గర క్యూ లైన్ల బట్టి చూస్తే అర్థం అవుతుందని తెలిపారు. తక్కువ ధరకు ఉల్లిపాయలను అందిస్తున్నాం కాబట్టే ప్రజలు కొనుగోలు చేసేందుకు క్యూ లైన్లో ఉంటున్నారని తెలిపారు జగన్. రూ.25కే కిలో ఉల్లిని అందిస్తున్నాం కాబట్టే ప్రజలు క్యూ లైన్లో నిల్చుని ఉన్నారని చెప్పుకొచ్చారు సీఎం జగన్.
AP Assembly: అసెంబ్లీలో కొడాలి నాని బూతులు: బాడీలో బుర్ర ఉండదంటూ అచ్చెన్నపై
తమ ప్రభుత్వం కిలో ఉల్లిని రూ.25కే అందిస్తుంటే చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ లో కిలో రూ.200కు అమ్ముతున్నారంటూ జగన్ మరోసారి ఆరోపించారు. అయినప్పటికీ చంద్రబాబు శవరాజకీయాలు చేయడం మానడం లేదన్నారు. శవం దొరికితే చాలు రాజకీయం చేయడమేనంటూ విరుచుకుపడ్డారు.
రాబోయే ఆదివారం నాటికి కేవలం రైతు బజార్లలోనే కాకుండా మార్కెట్ యార్డులలో కూడా ఉల్లిపాయలను అమ్మేలా చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు. ఇప్పటికే సమీక్షలు నిర్వహించానని ఆదివారం నుంచి మార్కెట్ యార్డులలో ఉల్లిని అమ్మి కొనుగోలు దార్లకు ఇబ్బందులు లేకుండా చూస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఉల్లి ధర ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఇంతలా ముందుకు వచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. చంద్రబాబు నాయుడు తన ఆత్మసాక్షిని ప్రశ్నించుకోవాలని సూచించారు. గుండెలమీద చేయి వేసుకుని ప్రశ్నించుకుంటే తెలుస్తుందని జగన్ సూచించారు.
నీ జాగీరు కాదు, గుడివాడలో నేనున్నా జాగ్రత్త: చంద్రబాబుకు కొడాలి నాని వార్నింగ్