అది నీ జాగీరు కాదు, గుడివాడలో నేనున్నా జాగ్రత్త: చంద్రబాబుకు కొడాలి నాని వార్నింగ్

By Nagaraju penumala  |  First Published Dec 10, 2019, 1:19 PM IST

రాష్ట్రమంతా తన జాగీరు అని ఏది చెప్తే అది జరిగిపోతుందని అనుకుంటున్నారని గుడివాడలో కొడాలి నాని ఉన్నాడన్న విషయం గుర్తుపెట్టుకోవాలంటూ చంద్రబాబును హెచ్చరించారు మంత్రి కొడాలి నాని.   


అమరావతి: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు ఏపీ మంత్రి కొడాలి నాని. రాష్ట్రమంతా చంద్రబాబు జాగీరు కాదని గుడివాడలో కొడాలి నాని ఉన్నాడు గుర్తుపెట్టుకోవాలంటూ హెచ్చరించారు. 

గుడివాడ రైతు బజార్ లో అస్వస్థతకు గురై మరణించిన సాంబరెడ్డి మృతిని రాజకీయంగా వాడుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. శవం దొరికితే చాలు చంద్రబాబు నాయుడు అక్కడ వాలిపోవడం అలవాటుగా చేసుకున్నారంటూ విరుచుకుపడ్డారు. 

Latest Videos

శవం దొరికితే వదలరా, నీకు ఆత్మసాక్షి లేదా: చంద్రబాబుపై జగన్ ఫైర్

చంపేది మీరే చచ్చిపోతే ముందుండేది మీరే అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఉల్లిపాయల కోసం క్యూ లైన్లో నిలబడినప్పుడు అస్వస్థతకు గురై మరణించిన సాంబరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. 

సాంబరెడ్డి కావాలని మార్కెట్ కు వెళ్లలేదని గుడికి వెళ్లొస్తూ అలా వెళ్లారే తప్ప ఉల్లికోసం వెళ్లలేదని చెప్పుకొచ్చారు. సాంబరెడ్డి ఉల్లిపాయల కోసమే క్యూ లైన్లో నిలబడుతూ చనిపోయాడని చెప్పాలంటూ టీడీపీ ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చిందని కొడాలి నాని ఆరోపించారు. 

పిచ్చాస్పత్రిలో చేర్చినా మీరు మారరు: టీడీపీపై జగన్ ధ్వజం

రూ.25లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తాం, ఉదయం చంద్రబాబు నాయుడు మీ ఇంటికి వచ్చి పరామర్శిస్తారని సాంబరెడ్డి కుటుంబ సభ్యులకు టీడీపీ నేతలు ఫోన్లు చేసి ఒత్తిడి తీసుకువచ్చిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. 

మాట్లాడేందుకు ఎలాంటి అంశాలు లేకపోవడంతో శవరాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు శవరాజకీయాలు మానుకోవాలని సూచించారు.

రాష్ట్రమంతా తన జాగీరు అని ఏది చెప్తే అది జరిగిపోతుందని అనుకుంటున్నారని గుడివాడలో కొడాలి నాని ఉన్నాడన్న విషయం గుర్తుపెట్టుకోవాలంటూ చంద్రబాబును హెచ్చరించారు మంత్రి కొడాలి నాని.   
అసెంబ్లీలోనూ కొడాలి నాని బూతులు: బాడీలో బుర్ర ఉండదంటూ అచ్చెన్నపై

హెరిటేజ్ నాది కాదు, నిరూపిస్తే రాజీనామా: జగన్‌కు బాబు సవాల్

click me!