అచ్చెన్నాయుడు దేహం విపరీతంగా పెంచారని దేహంలో నాలెడ్జ్ ఉంటుందని అనుకుంటున్నారని అది బుర్రలో ఉంటుందన్న విషయం తెలుసుకోవాలంటూ సూచించారు. ఈ సందర్భంగా తన ఆకారంపై మాట్లాడతారా అంటూ అచ్చెన్నాయుడు కొడాలి నానిపై విరుచుకుపడ్డారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్టైలే వేరు. ప్రతిపక్షపార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడటంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకోవచ్చు.
వార్నింగ్ లు ఇవ్వడం, ఆ తర్వాత ఘాటుగా సమాధానం చెప్పడంలో కొడాలి నాని స్టైల్ వేరు. ఇకపోతే ఇటీవల కాలంలో బూతులతో ప్రతిపక్ష పార్టీపై విరుచుకుపడుతూ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ మంత్రిగా పేర్గాంచారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబును బండ బూతులు తిట్టారు. ఇకపోతే అసెంబ్లీలో కొడాలి నాని లేస్తే బయటలానే బూతులు తిడతారా అన్న చర్చ జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లీకులు
అయితే మంగళవారం అసెంబ్లీలో నాణ్యమైన బియ్యం పంపిణీపై తెలుగుదేశం పార్టీ చర్చకు పట్టుబట్టింది. సన్నబియ్యం లేదా నాణ్యమైన బియ్యం పంపిణీపై వివరణ ఇస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుపడ్డారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సన్నబియ్యం పంపిణీ చేస్తానని చెప్పి నాణ్యమైన బియ్యం అంటూ మాట మారుస్తున్నారంటూ అధికార పార్టీపై విరుచుకుపడగా కొడాలి నాని తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిమ్మల రామానాయుడును డ్రామానాయుడు కూర్చో అంటూ విరుచుకు పడ్డారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. కొడాలి నాని బూతులు తిట్టాడంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు కూడా తిడతా అంటూ బూతుల పర్వం అందుకున్నారు.
జగన్ కు కౌంటర్: హెరిటేజ్ గ్రూప్ తో మాకు సంబంధం లేదన్న నారా భువనేశ్వరి
రామానాయుడు అయిపోయిన తర్వాత అచ్చెన్నాయుడుపై రెచ్చిపోయారు కొడాలి నాని. అచ్చెన్నాయుడు నాలెడ్జ్ పెంచుకోమని తమకు చెప్తున్నారంటూ విరుచుకుపడ్డారు. నాలెడ్జ్ అనేది బుర్రలో ఉంటుందని బాడీలో కాదంటూ సెటైర్లు వేశారు.
అచ్చెన్నాయుడు దేహం విపరీతంగా పెంచారని దేహంలో నాలెడ్జ్ ఉంటుందని అనుకుంటున్నారని అది బుర్రలో ఉంటుందన్న విషయం తెలుసుకోవాలంటూ సూచించారు. ఈ సందర్భంగా తన ఆకారంపై మాట్లాడతారా అంటూ అచ్చెన్నాయుడు కొడాలి నానిపై విరుచుకుపడ్డారు.
తన ఆకారం తనకు దేవుడు ఇచ్చిన వరం అని దానిపై మాట్లాడతావా అంటూ చిర్రుబుర్రులాడారు. దానిపై కూడా సెటైర్లు వేశారు కొడాలి నాని. బాడీ పెంచుకుని తనపైకి అచ్చెన్నాయుడు వస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడులా ఎదగాలంటే తాను గడ్డి ఉల్వలు తినాలా అంటూ ఘాటుగా సెటైర్లు వేశారు కొడాలి నాని.
మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అయి ఉండి సభలో బూతులు తిడతారా అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. మంత్రి బూతులు తిడుతున్నా కంట్రోల్ చేయకపోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాంపై మండిపడ్డారు.
పిచ్చాస్పత్రిలో చేర్చినా మీరు మారరు: టీడీపీపై జగన్ ధ్వజం