ప్రతిపక్షంగా టీడీపీ వైఫల్యం చెందింది: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం

By narsimha lode  |  First Published Jan 12, 2022, 4:58 PM IST


రాష్ట్రంలో విపక్షంగా టీడీపీ వైఫల్యం చెందిందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. బుధవారం నాడు శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు.


శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంగా వైఫల్యం చెందిందని ఏపీ అసెంబ్లీ  స్పీకర్‌ Tammineni Sitaram విమర్శించారు. బుధవారం నాడు ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. tdp అధినేత Chandrababu ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని తెలిపారు. ఓటీఎస్‌పై ప్రజలను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే పట్టాలిస్తామంటున్న టీడీపీ నేతలు.. అధికారంలో ఉండగా ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

గతంలో కూడా చంద్రబాబు ప్రజల విశ్వాసం కొల్పోయారని స్పీకర్ విమర్శించారు. చంద్రబాబు, సీఎం Ys Jaganప్రభుత్వాల మద్య అభివృద్ది, సంక్షేమంలో వ్యత్యాసం గురించి తాను మరోసారి మాటాడతానని తెలిపారు. అధికారంలోకి వస్తే ఓటీఎస్ ప్రీ చేస్తామంటున్నారని ఇంత వరకూ నిద్రపోయారా అని చంద్రబాబును స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడల్లా చంద్రబాబుపై, టీడీపీపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై టీడీపీ  విమర్శలు చేయడంపై తమ్మినేని సీతారాం మండిపడుతున్నారు. 

Latest Videos

అసెంబ్లీలో కూడా తమకు మైక్ ఇవ్వడం లేదని టీడీపీ సభ్యులు చేసిన విమర్శలకు అదే స్థాయిలో కూడా స్పీకర్ కౌంటర్ ఇచ్చేవారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్ గా తమ్మినేని సీతారాంకు జగన్ సర్కార్ అవకాశం ఇచ్చింది.  అయితే  గతంలో తమ్మినేని సీతారాం టీడీపీలో ఆ తర్వాత పీఆర్పీలో మళ్లీ టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉన్నారు.

 2014 ఎన్నికల్లో తమ్మినేని సీతారాం వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తమ్మినేని సీతారాంపై ఆయన సమీప బంధువు కూన రవికుమార్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.  2019 ఎన్నికల్లో కూన రవికుమార్ పై తమ్మినేని సీతారాం విజయం సాధించారు.ఈ స్థానంలో తమ్మినేని సీతారాం విజయం సాధించిన తర్వాత తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని కూన రవికుమార్ ఆరోపణలు చేశారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అక్రమ కేసులతో అరెస్టులు చేశారని ఆయన పలుమార్లు చెప్పారు. రవికుమార్ అరెస్ట్ పై కూడా చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు వైసీపీ సర్కార్ తీరుపై మండిపడ్డారు.

click me!