ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 24 గంటల్లో 3205 కేసులు

Published : Jan 12, 2022, 04:52 PM ISTUpdated : Jan 12, 2022, 05:04 PM IST
ఏపీలో భారీగా  పెరిగిన కరోనా కేసులు: 24 గంటల్లో 3205 కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే 3205కి కరోనా కేసులు చేరాయి. గత 24 గంటల్లో41,954 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 3205  మందికి కరోనా నిర్ధారణ అయింది

అమరావతి:Andhra pradesh  రాష్ట్రంలో   గత 24 గంటల్లో  భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 3205 corona కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో41,954 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 3205  మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,87,879కి చేరుకొన్నాయి.కరోనాతో గత 24 గంటల్లో ఎవరూ కూడా మరణించలేదు.  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,505 కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 281 మంది Corona నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 63వేల 255 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 10,119 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

గత 24 గంటల్లో అనంతపురంలో160,చిత్తూరులో 607, తూర్పుగోదావరిలో274,గుంటూరులో224,కడపలో 042, కృష్ణాలో217, కర్నూల్ లో123, నెల్లూరులో203, ప్రకాశంలో 090,విశాఖపట్టణంలో 695,శ్రీకాకుళంలో268, విజయనగరంలో 212,పశ్చిమగోదావరిలో 090కేసులు నమోదయ్యాయి.


ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,58,984, మరణాలు 1093
చిత్తూరు-2,50,980, మరణాలు1959
తూర్పుగోదావరి-2,95,960, మరణాలు 1290
గుంటూరు -1,80,209,మరణాలు 1260
కడప -1,16,200, మరణాలు 644
కృష్ణా -1,21,725,మరణాలు 1481
కర్నూల్ - 1,24,531,మరణాలు 854
నెల్లూరు -1,47,881,మరణాలు 1060
ప్రకాశం -1,38,089, మరణాలు 1130
శ్రీకాకుళం-1,24,333, మరణాలు 793
విశాఖపట్టణం -1,60,959, మరణాలు 1143
విజయనగరం -83,693, మరణాలు 673
పశ్చిమగోదావరి-1,80,440, మరణాలు 1125

 

ఈ నెల 18వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు  జారీ చేసింది.
ఈ నెల 31వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.

ఫార్మసీ దుకాణాలు, మీడియా సంస్థలు, టెలి కమ్యూనికేషన్లు, ఐటీ, విద్యుత్ సేవలు, పెట్రోల్ బంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణీకులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చారు. 

నైట్ కర్ఫ్యూతో పాటు కరోనా ఆంక్షలను కూడా కఠినంగా అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే రూ.10 నుండి రూ. 15 వేల వరకు ఫైన్ విధించనున్నారు.  షాపింగ్ మాల్స్, దుకాణాల వద్ద కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. సినిమా థియేటర్లో 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని ఆదేశించింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వ్యవస్థల్లో మాస్కులు తప్పనిసరి చేసింది జగన్ సర్కార్.సోమవారం నాడు వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ రాష్ట్రంలో అదే రోజు నుండే రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నైట్ కర్ఫ్యూను 18వ తేదీ నుండి అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

.దేవాలయాలు, ప్రార్థనామందిరాల్లో భౌతికదూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలని సీఎం జగన్ కోరారు. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి మించకూడదని..  ఇండోర్‌ కార్యక్రమాల్లో 100 మందికి మించకూడదని సీఎం జగన్ ఆదేశించారు. 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు నడపాలని థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని చెప్పారు. కోవిడ్ కొత్త వేరియంట్ నేపథ్యంలో మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu