మహిళలపై అత్యాచారం చేసేవాళ్లు.. భూమ్మీద ఉండకూడదు, సజ్జనార్‌కు సలాం: తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jul 23, 2021, 05:12 PM IST
మహిళలపై అత్యాచారం చేసేవాళ్లు.. భూమ్మీద ఉండకూడదు, సజ్జనార్‌కు సలాం: తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు

సారాంశం

ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారం చేసేవాళ్లను భూమ్మీద లేకుండా చేయాలన్నారు. సజ్జనార్‌లా మృగాళ్లను వేటాడాలంటూ వ్యాఖ్యానించారు.  

ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారం చేసేవాళ్లను భూమ్మీద లేకుండా చేయాలన్నారు. ఔట్ ఆఫ్ ది లా అమలు చేస్తేనే సమాజంలో సమాంతర న్యాయం సాధ్యమవుతుందని స్పీకర్ అన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను తమ్మినేని సీతారాం అభినందించారు. 

ALso Read:ఎవరికి ఎలా చెక్ పెట్టాలో తెలుసు: కూన రవికుమార్ పై తమ్మినేని ఫైర్

ఇక కొద్దిరోజుల క్రితం ఎవరికి ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో తనకు తెలుసునని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. టీడీపీ నేత, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పై విమర్శలు గుప్పించారు. ఎవరికి ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో తనకు తెలుసునని ఆయన చెప్పారు.గట్టిగా అరిస్తే బెదిరిపోయేవాడిని కాదన్నారు. వామానావతారంలాగే భూమిలోకి తొక్కేస్తానని ఆయన హెచ్చరించారు.వంద కాదు వెయ్యి అడుగులైనా ముందుకు పోతానని ఆయన చెప్పారు. తమ్మినేని ముందు నీ అరుపులు, కేకలు పనిచేయవన్నారు.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan Speech: కాకినాడ లో డిప్యూటీ సీఎం పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Spech: మీ భూమి మీ హక్కు రాజ ముద్రతో పట్టా ఇస్తా | Asianet News Telugu