24 గంటల్లో చిత్తూరులో అత్యధికం: ఏపీలో మొత్తం కరోనా కేసులు 19,50,339కి చేరిక

By narsimha lode  |  First Published Jul 23, 2021, 4:57 PM IST


ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు 19,50,339 కి చేరాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 1747 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుంది. 
 


అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో 65,920 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 1,747 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,50,339కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 14 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 13,223 కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 2,365 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 14 వేల 177 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 22,939 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,39,75,283 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో అనంతపురంలో045,చిత్తూరులో 293, తూర్పుగోదావరిలో234, గుంటూరులో086,కడపలో 054, కృష్ణాలో127, కర్నూల్ లో009, నెల్లూరులో239, ప్రకాశంలో 223,విశాఖపట్టణంలో 109, శ్రీకాకుళంలో082, విజయనగరంలో 031, పశ్చిమగోదావరిలో 215కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో కరోనాతో 14 మంది చనిపోయారు. చిత్తూరులో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరేసి చిప్పున చనిపోయారు. తూర్పుగోదావరి, ప్రకాశం, విశాఖపట్టణంలలో ఒక్కరేసి చొప్పేన మృతి చెందారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 13,223 మంది చనిపోయారు.

Latest Videos

undefined

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,55,870, మరణాలు 1077
చిత్తూరు-2,28,505, మరణాలు1702
తూర్పుగోదావరి-2,74,885, మరణాలు 1199
గుంటూరు -1,66,806,మరణాలు 1136
కడప -1,09,537, మరణాలు 617
కృష్ణా -1,06,822,మరణాలు 1178
కర్నూల్ - 1,23,020,మరణాలు 839
నెల్లూరు -1,32,522,మరణాలు 945
ప్రకాశం -1,27,883, మరణాలు 979
శ్రీకాకుళం-1,20,199, మరణాలు 758
విశాఖపట్టణం -1,51,583, మరణాలు 1073
విజయనగరం -81,262, మరణాలు 668
పశ్చిమగోదావరి-1,68,550, మరణాలు 1052

 

: 23/07/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,47,444 పాజిటివ్ కేసు లకు గాను
*19,11,282 మంది డిశ్చార్జ్ కాగా
*13,223 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 22,939 pic.twitter.com/YMJXdCCaYx

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!