ఎస్ఈసీ లేఖలు లీకైతే మాకేం సంబంధం: నిమ్మగడ్డ పిటిషన్‌పై స్పీకర్ స్పందన

Siva Kodati |  
Published : Mar 20, 2021, 04:19 PM IST
ఎస్ఈసీ లేఖలు లీకైతే మాకేం సంబంధం: నిమ్మగడ్డ పిటిషన్‌పై స్పీకర్ స్పందన

సారాంశం

ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి ఎస్ఈసీ వస్తారో లేదో ఆయనకే తెలుస్తుందన్నారు ఏపీ శాసససభ స్పీకర్ తమ్మినేతి సీతారాం. నిమ్మగడ్డకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులపై ఆయన స్పందించారు. ఓ మంత్రి తనకు ఫిర్యాదు చేశారని.. తాను ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేశారని సీతారాం స్పష్టం చేశారు. 

ఈ వ్యవహారానికి ప్రివిలేజ్ కమిటీదే పూర్తి బాధ్యత అని తమ్మినేని వెల్లడించారు. ఎస్ఈసీ లేఖలు లీకైతే మాకేం సంబంధమన్న ఆయన.. గవర్నర్ ఆఫీసు నుంచి లీకైతే వారిదే బాధ్యత అని స్పీకర్ తేల్చిచెప్పారు. 

కాగా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టుకు ఎక్కారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య వివాదం మరింతగా ముదురుతున్న నేపథ్యంలో ఈ విషయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గవర్నరతో తాను జరుపుతున్న ఉత్తరప్రత్యుత్తరాలు లీక్ కావడంపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

గవర్నర్ తో తాను జరుపుతున్న ఉత్తరప్రత్యుత్తరాలు ఎలా లీకవుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై సీబిఐతో విచారణకు ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు.

తన పిటిషన్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ను, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ను, మంత్రులు పెద్దిరెడ్డి రామంచ్దరారెడ్డి, బొత్స సత్యనారాయణలను ప్రతివాదులుగా చేర్చారు. 

తాను సెలవు పెట్టిన విషయం కూడా లీకైందని ఆయన చెప్పారు. తాను జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలు సోషల్ మీడియాలో లీకవుతున్నాయని ఆయన అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. 
 
PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!