అచ్చెన్నాయుడు, ఆత్రం పాత్రుడు తెగ గింజుకుంటున్నారు : విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా

Bukka Sumabala   | Asianet News
Published : Mar 20, 2021, 03:46 PM IST
అచ్చెన్నాయుడు, ఆత్రం పాత్రుడు తెగ గింజుకుంటున్నారు : విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా

సారాంశం

జనం సామాన్యులకు పట్టం కట్టారని ఎన్నికల ఫలితాల మీద ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఫలితాలు చూసి తమ పెత్తనం ఎక్కడ పోతుందోనని టీడీపీ నేత‌ల‌ు ఆందోళ‌న‌ చెందుతున్నారని ఎద్దేవా చేశారు. 

జనం సామాన్యులకు పట్టం కట్టారని ఎన్నికల ఫలితాల మీద ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఫలితాలు చూసి తమ పెత్తనం ఎక్కడ పోతుందోనని టీడీపీ నేత‌ల‌ు ఆందోళ‌న‌ చెందుతున్నారని ఎద్దేవా చేశారు. 

మీడియాలో టీడీపీ వారు చేసే విన్యాసాలను ఎవరూ నమ్మరని అన్నారు. ఉత్తరాంధ్రలో ఒక్క చోటా కనీసం పోటీ ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేత‌లు అచ్చెన్నాయుడు, అయ్య‌న్న పాత్రుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. 

ఇటీవ‌ల జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ఉత్త‌రాంధ్ర‌లోనూ వైసీపీ స‌త్తా చాటిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.'జనం సామాన్యులకు పట్టం కట్టడంతో తమ పెత్తనం ఎక్కడ పోతుందోనని అచ్చెన్నాయుడు, ఆత్రం పాత్రుడు తెగ గింజుకుంటున్నారు. 

నామ్ కే వాస్తే అధ్యక్ష పదవిని కూడా బాబు ఎక్కడ పీకుతాడోనని వణుకు. మీడియాలో వీరు చేసే విన్యాసాలను ఎవరూ నమ్మరు. అందుకే ఉత్తరాంధ్రలో ఒక్క చోటా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు' అంటూ టీడీపీ నేత‌ల‌పై విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్