సైకిల్ గుర్తు కోసం .. బాబు ఏం చేశాడో, ఎవరిని పంపాడో అందరికీ తెలుసు: కొడాలి నాని

Siva Kodati |  
Published : Mar 20, 2021, 03:54 PM IST
సైకిల్ గుర్తు కోసం .. బాబు ఏం చేశాడో, ఎవరిని పంపాడో అందరికీ తెలుసు: కొడాలి నాని

సారాంశం

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తనదైన శైలిలో పంచ్‌లు వేశారు మంత్రి కొడాలి నాని. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అత్యధిక స్టేలు తెచ్చుకున్న నేతగా చంద్రబాబు రికార్డులు సృష్టించారంటూ సెటైర్లు వేశారు

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తనదైన శైలిలో పంచ్‌లు వేశారు మంత్రి కొడాలి నాని. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అత్యధిక స్టేలు తెచ్చుకున్న నేతగా చంద్రబాబు రికార్డులు సృష్టించారంటూ సెటైర్లు వేశారు.

విచారణ ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. సైకిల్ గుర్తు కోసం చంద్రబాబు అప్పుడేం చేశారో అందరికీ తెలుసునని నాని ఆరోపించారు. జడ్పీ ఎన్నికల్లోనూ చంద్రబాబుకు పరాభవం తప్పదని మంత్రి జోస్యం చెప్పారు.

జయంతి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి లోకేశ్ అంటూ నాని ఫైరయ్యారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేశ్‌కు జగన్ గురించి మాట్లాడే స్థాయి వుందా అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు కోర్టులను, లాయర్లను మేనేజ్ చేయవచ్చు కానీ ప్రజలను మాత్రం మేనేజ్ చేయలేరని తెలుసుకోవాలంటూ నాని చురకలంటించారు.

ఆరోపణలపై సమాధానం కూడా చెప్పుకోలేదని దద్దమ్మ అంటూ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 5 కోట్ల మంది ప్రజలు చీత్కరించినా బాబుకు బుద్ధిరాలేదని.. చంద్రబాబు స్టేల బాబుగా ప్రఖ్యాతి గాంచారంటూ సెటైర్లు వేశారు.

చంద్రబాబు పెద్ద బ్రోకరని.. ఆనాడు ఎన్టీఆరే చెప్పారని కొడాలి నాని గుర్తుచేశారు. వైఎస్ఆర్ దెబ్బ ఎలా ఉంటుందో చంద్రబాబును అడిగి లోకేశ్ తెలుసుకోవాలని నాని అన్నారు.

దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్న చరిత్ర లోకేశ్‌దని.. కాళ్లు పట్టుకోవడం, చీకటి ఒప్పందాలు చేసుకోవడం చంద్రబాబు చరిత్ర అంటూ మంత్రి దుయ్యబట్టారు. ప్రజాకోర్టులో చంద్రబాబుకు ఉరిశిక్ష పడిందని కొడాలి నాని వ్యాఖ్యానించారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu