చర్చకు రెడీ.. అచ్చెన్నాయుడి లాంటి పానకంలో పుడకలొద్దు : చంద్రబాబుకు స్పీకర్ తమ్మినేని సవాల్

By Siva KodatiFirst Published Sep 28, 2022, 2:53 PM IST
Highlights

ఉత్తరాంధ్ర అభివృద్దిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్. చర్చకు అచ్చెన్నాయుడు వంటి పానకంలో పుడకలొద్దని తమ్మినేని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విమర్శించేవాళ్లకు అభివృద్ధికి ఏం కనిపిస్తుందన్నారు. ఎన్నికల్లో ప్రజలు తీర్పునిస్తారని.. ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్‌గా మార్చలేదా..? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని తమ్మినేని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. చర్చకు అచ్చెన్నాయుడు వంటి పానకంలో పుడకలొద్దని తమ్మినేని ఘాటు వ్యాఖ్యలు చేశారు. డైరెక్ట్‌గా చంద్రబాబుకి సవాల్ విసురుతున్నానని స్పీకర్ స్పష్టం చేశారు. 

అంతకుముందు .. అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రను అడ్డుకోవడానికి రాష్ట్రమేమైనా నీ జాగీరా అని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు వారి హక్కుల కోసం పాదయాత్రలు చేస్తుంటే మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయొద్దా అని వైసీపీ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారని.. దద్దమ్మల్లారా డెవలప్‌ చేస్తానంటే వద్దంటామా అని ఆయన నిలదీశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మూడు రాజధానులు అంటున్నారని.. ఈ మూడేళ్లలో ఉత్తరాంధ్రకు వైసీపీ చేసిందేమిటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రుషికొండను కాజేస్తున్నారని.. ఉత్తరాంధ్రలోని భూములను కొట్టేయడానికి నాటకాలు ఆడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

ALso REad:దద్దమ్మల్లారా... అభివృద్ధి చేస్తామంటే ఎవరొద్దన్నారు : వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు కౌంటర్

కాగా.. అంతకుముందు ఆదివారం వైసీపీ ఆధ్వర్యంలో విశాఖపట్టణంలో నిర్వహించిన పాలనా వికేంద్రీకరణపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం  రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని మరో ఐదేళ్లు తమ ప్రభుత్వం పొడిగించిందని మంత్రి తెలిపారు.అమరావతి పేరుతో చంద్రబాబు సర్కార్ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసిందని బొత్స సత్యనారాయణ విమర్శించారు.  
 

click me!