భర్తకు టిక్ టాక్ ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య ఘటనలో షాకింగ్.. ఆమె అసలు భార్యే కాదు...

Published : Sep 28, 2022, 01:20 PM IST
భర్తకు టిక్ టాక్ ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య ఘటనలో షాకింగ్.. ఆమె అసలు భార్యే కాదు...

సారాంశం

భర్తకు అతని టిక్ టాక్ ప్రియురాలితో రెండో పెళ్లి చేసి వార్తల్లోకి ఎక్కిందో ఆ మహిళ. అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 

తిరుపతి : భార్య, భర్త, ప్రియురాలు... టిక్ టాక్ లో ఏర్పడిన పరిచయం ఆ ముగ్గురిని ఒకటి చేసింది. భర్తకు దగ్గరుండి ప్రియురాలితో పెళ్లి చేసింది ఓ భార్య. ఈ ఘటన వారం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అయితే టిక్ టాక్ లో పరిచయమైన వ్యక్తితో భర్తకు పెళ్లి చేసిన భార్య కథలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తనకు, తన భర్తకు జరిగిన పెళ్లిలో మొదటి భార్యగా చెబుతున్న విమల అనే మహిళకు ఎలాంటి సంబంధం లేదని నిత్యశ్రీ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

పెళ్లి జరిగిన తర్వాత పెళ్లి కుమారుడు కళ్యాణ్ కనబడకుండా పోయాడు. ఇప్పుడు మొదటి భార్యను నేనే, మొదటి ప్రేమికురాలిని నేనే అంటూ నిత్యశ్రీ చేసిన కామెంట్ సంచలనంగా మారాయి. తనకు తన భర్తకు పెద్దల సమక్షంలో పెళ్లి చేశారని, తనే మొదటి భార్య  అని చెప్పుకునే విమలకు ఇదివరకే రెండుపెళ్లిళ్లు జరిగాయని రహస్యాన్ని వెల్లడించింది. తన భర్తకు మాయమాటలు చెప్పి విమల.. కళ్యాణ్ తీసుకు వెళ్ళిందని షాకింగ్ విషయం చెప్పుకొచ్చింది. వారం రోజులుగా భర్త కళ్యాణ్ కోసం వేచి చూస్తున్నా అని చెప్పింది. మరో రెండు రోజులు చూసి అప్పటికి కళ్యాణ్ రాకపోతే పోలీసులను ఆశ్రయిస్తా అని కన్నీటి పర్యంతం అయ్యింది.

ఇదేం విడ్డూరం.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య..

టిక్ టాక్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నిత్యశ్రీకి విశాఖపట్నానికి చెందిన కళ్యాణ్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్ళు ఇద్దరు సన్నిహితంగానే ఉన్నారు. తర్వాత వివిధ కారణాలతో దూరమయ్యారు. అదే సమయంలో మరో యువతితో సదరు యువకుడికి పరిచయం అయ్యింది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. విషయం తెలుసుకున్ననిత్య నేరుగా  తిరుపతిలో ఉంటున్న వీరి ఇంటికి వచ్చింది. కళ్యాణ్ ను ప్రేమించానని, అతడిని విడిచి ఉండలేను అని.. చెప్పింది. ఆ యువకుడి భార్యతో మాట్లాడింది. తాను ఇక్కడే ఉంటానని అందరం కలిసే ఉందామని చెప్పింది. ఆమె మాటలను వ్యతిరేకించిన భార్య.. తన భర్తపై ఆమెకు ఉన్న ప్రేమను చూసి ఒప్పుకుంది. తన భర్తకు ఆ యువతితో పెళ్లి చేసింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 22న ఓ భార్య తన భర్త ప్రేమించిన మహిళతో అతనికి వివాహం చేసింది. అంతేకాదు దగ్గరుండి మరీ వారిద్దరినీ తయారుచేసి పెళ్లి చేయడంతో అది చూసిన అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన  చర్చనీయాంశంగా మారింది. టిక్ టాక్ లో ఏర్పడిన ప్రేమ వ్యవహారంలో ఓ మహిళ తన భర్తకు దగ్గరుండి రెండోపెళ్లి చేయడం తిరుపతిజిల్లా డక్కిలి మండలంలో చర్చనీయాంశంగా మారింది. స్థానిక అంబేద్కర్ నగర్ కు చెందిన ఓ యువకుడు టిక్ టాక్ లో విశాఖకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. తర్వాత ఆమె నుంచి దూరమయ్యాడు. ఆపై టిక్ టాక్ లోనే పరిచయం అయిన కడపకు చెందిన మరో యువతిని పెళ్ళి చేసుకున్నాడు.

కొన్నాళ్లు వేచి చూసిన విశాఖ యువతి తిరుపతికి రావడంతో అతనికి పెళ్లి అయిన విషయం తెలిసింది. అయినా ఆమె నిరాశ పడకుండా.. ఆ యువకుడి భార్యతో మాట్లాడి తానూ ఇక్కడే ఉంటానని, అంతా కలిసి ఉందామని చెప్పడంతో ఆమె మొదటి అయోమయం చెందింది. చివరకు ముగ్గురూ కలిసి ఉండడానికి ఒప్పుకొని తన భర్తకు ఆ యువతితో పెళ్లి చేయడానికి సిద్ధపడింది. దీతో వారి వ్యవహారం పెళ్లి పీటల వరకు చేరింది. దగ్గరుండి భర్త, ప్రియురాలిని అలంకరించి పెళ్లి చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu
Legendary Actor Krishnam Raju 86th Birth Anniversary | Free Mega Diabetes Camp | Asianet News Telugu