
మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయన కరోనా బారినపడ్డారు. కాగా.. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎంఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ పూర్తి చసిన ఆయన 1975 ఐఏఎస్ బ్యాక్ కు చెందిన అధికారి కావడం గమనార్హం.
నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్ గా ఎస్వీ ప్రసాద్ తన కెరిర్ ని ప్రారంభించారు. అనంతరం 1982లో కడప, 1985లో విశాఖపట్నం జిల్లాల కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఛైర్మన్ గా వ్యవహరించారు. అంతేకాకుండా... పలు శాఖలకు కార్యదర్శి, ముఖ్యకార్యదర్శి స్థాయి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఆయన ఎదిగారు.
2020లో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు సీఎస్ గా పనిచేశారు. తన కంటే 20మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నా ఎస్వీ ప్రసాద్ నే సీఎస్ పోస్టు వరించడం గమనార్హం. పదేళ్లకు పైగా ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద ఎస్వీ ప్రసాద్ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు.
నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు హయాంలో ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు.