బడ్జెట్‌కు ఆమోదముద్ర.. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

By Siva KodatiFirst Published May 20, 2021, 5:04 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో ఇవాళ ఒక్కరోజే అసెంబ్లీ, మండలి సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో ఇవాళ ఒక్కరోజే అసెంబ్లీ, మండలి సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు.

గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. శాసన మండలిలో మంత్రి ధర్మాన కృష్ణదాసు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2021-22 బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లు. తొలిసారిగా జెండర్ బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ వార్షిక బడ్జెట్‌లో రూ.47 వేల 283 కోట్లు జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. చిన్నపిల్లలకు చైల్డ్ బడ్జెట్‌లో రూ.16,748.47 కోట్లు ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు.

Also Read:40 ఏళ్ల ఇండస్ట్రీ లేదు, ఎల్లో మీడియా మద్దతు లేదు: చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు

అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ... ప్రాణం విలువ తనకు తెలిసినందునే ఆరోగ్యశ్రీ లో మార్పులు చేసి  ప్రతి పేదవాడికి వైద్యం అందేలా చర్యలు తీసుకొన్నామన్నారు. బ్లాక్ ఫంగస్ కేసులను కూడ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్టుగా  ఆయన ప్రకటించారు.

అంతకు ముందు కరోనాతో మరణించిన వారికి ఏపీ అసెంబ్లీ సంతాపాన్ని తెలిపింది. ఆరోగ్యశ్రీలో 2400 వ్యాధులకు చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రాణం విలువ తెలిసినందున ఆరోగ్యశ్రీలో అనేక మార్పులు తీసుకొచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు.  రాష్ట్రంలో రూ. 5 లక్షల వార్షికాదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడ ఆరోగ్యశ్రీ వర్తించేలా నిబంధనలు మార్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 

click me!