సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను ఈ నెల 24 వరకు ఆస్పత్రిలోనే ఉంచాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌కు కూడ ఇవే ఆదేశాలు వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. వీరిని డిశ్చార్జ్ చేసే సమయంలో కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యంపై నివేదికలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
అమరావతి: సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను ఈ నెల 24 వరకు ఆస్పత్రిలోనే ఉంచాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌కు కూడ ఇవే ఆదేశాలు వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. వీరిని డిశ్చార్జ్ చేసే సమయంలో కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యంపై నివేదికలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
also read:సంగం డెయిరీ సెక్రటరీ సందీప్‌ను అదుపులోకి తీసుకొన్న ఏసీబీ
సంగం డెయిరీ లో అవకతవకలు చోటు చేసుకొన్నాయనే ఆరోపణలతో డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. డెయిరీలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనను అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారులు ప్రకటించారు. అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం ఐపీసీ 408, 409, 418, 420, 465, 471, 120(బీ) రెడ్‌విత్ 34 కింద నరేంద్రపై అభియోగాలు మోపారు.
ఈ కేసులో అరెస్టైన దూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు ఆరోగ్య సమస్యలు తలెత్తిన సమయంలో కోర్టు సూచన మేరకు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పూర్తైన తర్వాత ఆయనను జైలుకు తరలించారు. అయితే తాజాగా ఆసుపత్రిలో ఉంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.