అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరం: టీడీఎల్పీ కీలక నిర్ణయం

By narsimha lode  |  First Published Nov 19, 2021, 5:24 PM IST

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకొన్నారు. భవిష్యత్తులో అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని సమావేశాలకు  హాజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయం తీసుకొంది.



అమరావతి: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని టీడీపీ ప్రజా ప్రతినిధులు నిర్ణయం తీసుకొన్నారు. భవిష్యత్తులో జరిగే సమావేశాలకు అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు.   ఇవాళ టీడీఎల్పీలో చంద్రబాబునాయుడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు.  అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే  మొత్తం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలా వద్దా అనే విషయమై కూడా చర్చించారు.  అయితే భవిష్యత్తులో జరిగే సమావేశాలకు మాత్రం అవసరాన్ని సమావేశాలకు వెళ్లే విషయమై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

also read:AP Assembly session: ఏపీ అసెంబ్లీలో ఇరుపక్షాల వాగ్వాదం.. మంత్రలు కొడాలి నాని, కన్నబాబు ఏం మాట్లారంటే..?

Latest Videos

తాను మాత్రం ఈ ap assembly సమావేశాలకు హాజరు కాబోనని అసెంబ్లీ వేదికగానే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. Chandrababu సభకు వెళ్లకుండానే పార్టీ ప్రజా ప్రతినిధులు సభకు వెళ్లే విషయమై చర్చించారు. గతంలో ntr విపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా అసెంబ్లీకి తాను హాజరు కాబోనని శపథం చేశారు. 1994లో సీఎం అయ్యాకే ఎన్టీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టారు.  అయితే ఇదే తరహలోనే ఈ దఫా కూడ అసెంబ్లీకి సమావేశాలకు వెళ్లే విషయమై  ఈ సమావేశంలో చర్చించారు.  గతంలో ఎన్టీఆర్ ఒక్కే అసెంబ్లీకి హాజరు కాలేదు. కానీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజరై అప్పటి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించేవారు.  గత రెండేళ్లుగా తనను అవమానపర్చారన్నారు. ఈ సభకు తాను రానని చెప్పారు, క్షేత్రస్థాయిలో తేల్చుకొనేందుకే తాను అసెంబ్లీకి రానని తెలిపారు. మళ్లీ సీఎంగా  బాధ్యతలు స్వీకరించాకే అసెంబ్లీకి హాజరౌతానని చంద్రబాబు తేల్చి చెప్పారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎన్టీఆర్ శపథం

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో  ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లనని ప్రకటించారు. అయితే టీడీపీకి చెందిన ఆ  పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. 1989లో టీడీపీ అధికారానికి దూరమైంది. ఈ సమయంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీకి దూరంగా ఉంటానని ఎన్టీఆర్ ప్రకటించారు.1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి టీడీపీ, లెఫ్ట్ పార్టీల కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఎన్టీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు.  

ఇదిలా ఉంటే ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడా పాదయాత్ర చేసిన సమయంలో చంద్రబాబు అసెంబ్లీకి హాజరు కాలేదు. కానీ ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా  అసెంబ్లీకి హాజరయ్యారు. పాదయాత్ర నుండే పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు  దిశా నిర్ధేశం చేసేవారు. అయితే ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగానే తాను అసెంబ్లీకి హాజరు కానని ప్రకటించారు.అయితే మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానన్న చంద్రబాబు శపథం నెరవేరుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

click me!