ఏపీ అసెంబ్లీలో దిశ బిల్లు, మృగాలకు ఉరే సరైన శిక్ష:హోంశాఖ మంత్రి సుచరిత

By Nagaraju penumala  |  First Published Dec 13, 2019, 12:20 PM IST

ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దారుణాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.


అమరావతి: మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు వైయస్ జగన్ ప్రభుత్వం ఇటీవల రూపొందించిన దిశ 2019 బిల్లను అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దారుణాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న దాడులు అందర్నీ కలచివేస్తున్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

Latest Videos

undefined

మహాత్మగాంధీజీ అన్నట్లు అర్థరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కానీ ఆడపిల్ల పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో మహిళల భద్రత కోసం తమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక చట్టాలను తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా దిశ 2019 చట్టాన్ని తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. 

బాత్ రూమ్ దగ్గర దాక్కునేవాళ్లం,.. వాళ్ళ అంతలా వేధించారు: వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన...

ఏపీలో మహిళలకు, చిన్నారులకు జగన్ అన్న ఒక రక్ష అని తెలియజేసేందుకే ఈ చట్టం అని చెప్పుకొచ్చారు. మహిళలపై చెయ్యివేస్తే పడుతుంది కఠిన శిక్ష అనే తరహాలో ఈ చట్టం ఉండబోతుందన్నారు. 

ఇప్పటి వరకు మహిళలపైనా, చిన్నారులపైనా అనేక ఘోరాలు చోటు చేసుకున్నాయని అయితే ఆ కేసుల్లో విచారణ పేరుతో కాలం గడిచిపోతుందన్నారు. నెలల తరబడి విచారణ వల్ల నేరం చేసిన వ్యక్తులు బెయిల్ పై వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నారని సుచరిత అన్నారు. 

నిందితులు బయటకు రాకుండా ఉండేందుకు 14 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకునేందుకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. అలాగే ప్రతీ జిల్లాకు ప్రత్యేక కోర్టులను సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. 

చంద్రబాబు అండ్ టీంపై చర్యలు తీసుకోండి: మంత్రి బుగ్గన తీర్మానం...

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు భద్రత కల్పించేందుకు ఈ చట్టం తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చారు. జగన్ తన తోబుట్టువుల కోసం ఇలాంటి చట్టాన్ని తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. ఏపీ దిశ 2019 చట్టాన్ని తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మేకతోటి సుచరిత. 

మహిళలపట్ల ఎవరైనా అభ్యంతకరంగా పోస్టులు పెట్టినా, మెసేజ్ లు చేసినా రెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతోపాటు లక్ష రూపాయలు  జరిమానా విధించేలా 354(E)చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. శిక్ష పడిన నిందితులు మళ్లీ బయటకు వచ్చి ఇలాంటి నేరాలకు పాల్పడితే నాలుగు సంవత్సరాలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు. 

ఇకపోతే 354(F) ప్రకారం చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడతారో అలాంటి వారికి 10 నుంచి 14 ఏళ్లపాటు జైలు శిక్ష విధించేలా చట్టం రూపకల్పన చేసినట్లు తెలిపారు.

హాస్టల్స్ లో గానీ, విధి నిర్వహణలో మహిళలు వేధింపులకు గురైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో వేధింపులకు గురవుతున్న మహిళలకు అభయాంధ్రప్రదేశ్ గా ఉంటుందని తెలిపారు హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత. 

చంద్రబాబు గిల్లుడుకు ఆ ఎమ్మెల్యే ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది: వైసీపీ ఎమ్మెల్యే రాజా..

click me!