ఎన్టీఆర్ ని నడిరోడ్డుపై కూర్చోబెట్టిన వైఎస్: అసలు విషయం చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం

By Nagaraju penumalaFirst Published Dec 12, 2019, 3:23 PM IST
Highlights

ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమస్యలపై ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ని నిలిపితే ఆయన రోడ్డుపై నిరసన తెలియచేసే పరిస్దితికి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ ను వెళ్లనీయాలంటూ వైఎస్ కాంగ్రెస్ నేతలకు చెప్పారని గుర్తు చేశారు. 
 

అమరావతి: అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను ఉద్దేశిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి. 

ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్మాది అంటూ చేసిన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకుంటే గౌరవప్రదంగా ఉంటుందని సూచించారు. సభలో ఆవేశంలో మాట్లాడానని ఒప్పుకోవాలంటూ సూచించారు. 

చంద్రబాబు నాయుడు తప్పు ఒప్పుకోవాలని లేకపోతే ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాల్సి వస్తుందని మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి హెచ్చరించారు. సభలో జరుగుతున్న చర్చపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.

సభానాయకుడి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందని తెలిపారు. రెండు రోజులుగా సభలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధనిపిస్తోందన్నారు. ఎంతో ఓర్పుతో సహనంతో సభ సజావుగా జరగాలని గౌరవమర్యాదలకు ప్రతీకగా ఉండాలని స్పీకర్ గా తమరు ఎంతో ప్రయత్నం చేస్తున్నారని స్పష్టం చేశారు.  

గౌరవప్రదమైన చట్ట సభలో వ్యక్తిత దూషణలు, వ్యవస్దలను నిర్లక్ష్యం చేయడం పరిణామాలు చోటు చేసుకోవడం బాధనిపిస్తోందన్నారు. రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు గానీ సంబంధం లేని కుటుంబసభ్యుల జోలికి వెళ్లడం సమంజసం కాదన్నారు. 

నీకు మానవత్వం లేదు, దేవుడు చూసుకుంటాడులే: చంద్రబాబుపై జగన్ ధ్వజం...

పార్టీలతో మొదలై కుటుంబాలు, వ్యవస్దలు, కులాలు, మతాలు ఈరోజు సభానాయకులను అమర్యాదగా సంబోధించే పరిస్థితికి రావడం చూస్తుంటే బాధనిపిస్తోందన్నారు. అసలు సభలో ఏం జరుగుతుందో ఎక్కడ ఉన్నామో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు.  

దివంగత సీఎం ఎన్టీఆర్‌ని నడిరోడ్డుపై కూర్చోబెట్టారంటూ టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎన్టీఆర్ ను నడిరోడ్డుపై నిలబెట్టిన మాట వాస్తవమేనంటూ చెప్పుకొచ్చారు. 

ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమస్యలపై ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ని నిలిపితే ఆయన రోడ్డుపై నిరసన తెలియచేసే పరిస్దితికి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ ను వెళ్లనీయాలంటూ వైఎస్ కాంగ్రెస్ నేతలకు చెప్పారని గుర్తు చేశారు. 

ఏపీ అసెంబ్లీలో మంత్రి కన్నబాబు, అచ్చెన్నాయుడు మధ్య ఆసక్తికరం.

అయినా ఎన్టీఆర్ తన నిరసనను ఆపలేదన్నారు. కాంగ్రెస్ సభ్యులు చేయండి నేను కూడా చేస్తానని ఆనాడు ఎన్టీఆర్ అన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఛాంబర్‌ అద్దాలు పగులుగొట్టారని చెప్పారనడం వాస్తవం కాదన్నారు. 

ఆరోజు చంద్రబాబు తన ఛాంబర్ లో ఉంటే సీఎల్పీ నేత అయిన వైయస్ఆర్ తోపాటు శాసనసభ్యులం అంతా నిరసన తెలిపేందుకు ఆయన ఛాంబర్ వద్దకు వెళ్లినట్లు గుర్తు చేశారు. అయితే మార్షల్స్ అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుందన్నారు. 

తోపులాటలో తామంతా వెళ్లి ఛాంబర్ వద్ద ఉన్న అద్ధాలపై పడిపోయామని మార్షల్స్ నెట్టడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఆ ఘటనపై ఎథిక్స్ కమిటీ వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చిందన్నారు. తమ తప్పు లేదని ఎథిక్స్ కమిటీ చెప్పిన విషయాన్ని ఆనం రామనారాయణరెడ్డి గుర్తు చేశారు. ఇప్పటికైనా సభను హుందాగా నడిపించాలని కోరారు మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి. 

నన్ను ఎంతలా ఏడిపించావ్: మగధీర సినిమా డైలాగ్ చెప్తూ చంద్రబాబుపై రోజా పంచ్ లు...

click me!