చంద్రబాబుకు మానవత్వం లేదన్న విషయం మన అందరికీ తెలిసిందేనని ఆయన చేసిన వ్యాఖ్యలను పైన ఉన్న దేవుడు చూసుకుంటాడని అయితే సభను ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు సీఎం జగన్.
అమరావతి: మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. తనను చంద్రబాబు ఉన్మాది అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్తారని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు మానవత్వం లేదనే విషయం అందరికీ తెలుసునన్నారు జగన్. కొంతమంది మనుషులు కరుడుగట్టిన స్వభావంతో ఉంటారుని వాళ్లలో మానవత్వం ఎక్కడా కనిపించదన్నారు సీఎం జగన్.
మార్షల్స్ మీద అన్యాయంగా అభాండాలు వేస్తున్నారంటూ మండిపడ్డారు. జరగని గొడవను జరిగినట్టుగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తారు. జరిగిన ఘటనలను స్పష్టంగా టీవీల్లో చూస్తున్నామని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు చుట్టూ బ్లాక్‌క్యాట్ కమాండోలు ఉన్నారని వాళ్లు ఎవ్వరినీ దగ్గరకు రానివ్వరన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పుకొచ్చారు. అలాంటి బ్లాక్‌క్యాట్ కమాండోలను పెట్టుకుని మార్షల్స్ మీద చంద్రబాబు దౌర్జన్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఉన్మాది అంటూ రెచ్చగొట్టే మాటలను చంద్రబాబు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. మార్షల్స్‌ను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు అన్యాయంగా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. సభలో రెచ్చగొట్టే మాటలకే చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.
ఆయన చనిపోవడంతో చంద్రబాబులో మార్పు, బతికి ఉంటేనా...: గుట్టువిప్పిన మంత్రి అవంతి..
సభ ముందుకు సాగాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొచ్చారు సీఎం జగన్. ఏ అంశం లేకపోయే సరికి ఒక జీవోను తీసుకొచ్చి రాద్ధాంతం చేశారంటూ విరుచుకుపడ్డారు. దానికి కాస్త మసాలా జోడించి బయట జరగని గొడవను జరిగినట్టుగా సృష్టించే కార్యక్రమం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
పాపం మార్షల్స్‌మీద అభాండాలు వేస్తున్నారకని అది సరికాదన్నారు. సభాసమయం వృథా అవుతోందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు క్షమాపణ చెప్తారా? లేదా? అన్నది ఆయన విజ్ఞతకే వదిలేద్దామని స్పష్టం చేశారు.
చంద్రబాబుకు మానవత్వం లేదన్న విషయం మన అందరికీ తెలిసిందేనని ఆయన చేసిన వ్యాఖ్యలను పైన ఉన్న దేవుడు చూసుకుంటాడని అయితే సభను ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు సీఎం జగన్.
ఏపీ అసెంబ్లీలో మంత్రి కన్నబాబు, అచ్చెన్నాయుడు మధ్య ఆసక్తికరం..