ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లు: ఏపీ అసెంబ్లీ ఆమోదం

By narsimha lodeFirst Published Sep 21, 2022, 2:04 PM IST
Highlights

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇవాళ ఏపీ మంత్రి విడుదల రజని ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు ప్రవేశ పెట్టడానికి ముందే టీడీపీ  ఎమ్మెల్యేలు సభ నుండి సస్పెన్షన్ కు గురయ్యారు. 
 

అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లుకు ఏపీ అసెంబ్లీ బుధవారం నాడు ఆమోదం తెలిపింది. 

ఇవాళ ఈ బిల్లును ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని ప్రవేశ పెట్టారు.  వైద్యరంగంలో సంస్కరణకు వైఎస్ఆర్ శ్రీకారం చుట్టినందునే ఆయన పేరును ఈ హెల్త్ యూనివర్శిటీకి పెట్టాలని తాము భావించినట్టుగా మంత్రి చెప్పారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు సర్కార్ కంటే తమ ప్రభుత్వమే గొప్పగా గౌరవించిందన్నారు. ఎన్టీఆర్ ను కించపర్చేలా గతంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ బిల్లును ప్రవేశ పెట్టే సమయంలో  మంత్రి రజని ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఈ విషయమై సీఎం జగన్ కూడా ప్రసంగించారు. ఎన్టీఆర్ ను కించపర్చే ఉద్దేశ్యం తమకు లేదని చెప్పారు. ఎన్టీఆర్ అంటే తమకు గౌరవం ఉందన్నారు. వైద్య రంగంలో సేవలు చేసినందుకే వైఎస్ఆర్ పేరును మెల్త్ యూనివర్శిటీకి పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

అనంతరం  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ కి వైఎస్ఆర్ పేరును పెడుతూ తెచ్చిన బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.  ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందే అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుండి సస్పెండయ్యారు. సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లుకు  అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 

also read:హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరుపై టీడీపీ ఎమ్మెల్సీల ఆందోళన: రెండుసార్లు ఏపీ శాసనమండలి వాయిదా

ఇవాళ్టితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.ఈ నెల 15వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15, 16, 19, 20,21 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సభలో ఏదో ఒక అంశంపై ఆందోళనలు నిర్వహించడంతో ఐదు రోజుల పాటు టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుండి సస్పెండయ్యారు.
 

click me!