సీఆర్‌డీఏ చట్ట సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం..

By Sumanth KanukulaFirst Published Sep 21, 2022, 4:15 PM IST
Highlights

ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలెప్‌మెంట్ అధారిటీ (సీఆర్‌డీఏ), ఏపీ మెట్రోపాలిటిన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలెప్‌మెంట్ అధారిటీ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలెప్‌మెంట్ అధారిటీ (సీఆర్‌డీఏ), ఏపీ మెట్రోపాలిటిన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలెప్‌మెంట్ అధారిటీ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు కేటాయించేందుకు సీఆర్‌డీఏ చట్టానికి సవరణ చేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. రాజధాని ప్రాంతంలో పేదల కోసం చేపట్టే ఇళ్ల నిర్మాణానికి అనుమతిస్తూ చట్ట సవరణ చేసినట్టుగా పేర్కొంది.  సీఆర్‌డీఏ చట్ట సవరణ బిల్లును మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం బిల్లు ఆమోదం పొందినట్టుగా ప్రకటించారు. 

రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు, రాజధాని పరిధిలో స్థానిక సంస్థలకు ఎన్నికైన పాలకమండళ్లు లేని పక్షంలో.. స్పెషల్ ఆఫీసర్ల సిఫారసుతోనే రాజధాని మాస్టర్ ప్లాన్‌లో సవరణలు వీలు కల్పిస్తూ సీఆర్‌డీ చట్టంలో చేసిన సవరణలకు ఇటీవల సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు. 

click me!