ఆయన చనిపోవడంతో చంద్రబాబులో మార్పు, బతికి ఉంటేనా...: గుట్టువిప్పిన మంత్రి అవంతి

By Nagaraju penumalaFirst Published Dec 12, 2019, 12:35 PM IST
Highlights

వైయస్ చనిపోవడంతో రాష్ట్రానికి ఆయనే దిక్కు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తానొక్కడినే నాయుకుడిని అన్నట్లు గా చంద్రబాబు నాయుడు ఫీలవుతున్నారంటూ సెటైర్లు వేశారు. 
 

అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. చంద్రబాబును తాను గత 20 ఏళ్లుగా గమనిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నంత కాలం ఒకలా ప్రవర్తించారని ఆయన చనిపోయిన తర్వాత మరోలా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. వైయస్ మరణానంతరం చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ లో గానీ అతని బిహేవియర్ లో గానీ మార్పు వచ్చిందన్నారు. 

వైయస్ చనిపోవడంతో రాష్ట్రానికి ఆయనే దిక్కు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తానొక్కడినే నాయుకుడిని అన్నట్లు గా చంద్రబాబు నాయుడు ఫీలవుతున్నారంటూ సెటైర్లు వేశారు. 

చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తాను వైసీపీలో చేరతానని చెప్పుకొచ్చినగ్లు గుర్తు చేశారు. వైసీపీలోకి వెళ్తాను వెళ్లిన తర్వాత మంత్రిగా కూడా కనిపిస్తానని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్.  

బూటు కాళ్లతో తన్నారు, ఐదేళ్లు బతుకుతానో చస్తానో కూడా ...: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి.

జగన్ పిలిస్తే టీడీపీ 80శాతం ఖాళీ అవుతుందని కూడా తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. వైసీపీ లోకి వెళ్లి మంత్రి అవుతానని చంద్రబాబుకి చెప్తే తాను ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ అధికారంలోకి రాదని చంద్రబాబు తనను అవమానించేలా మాట్లాడారని గుర్తు చేశారు. 

రాజధానిలో పర్యటించినప్పుడు చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు వేసిన ఘటనను చూస్తే తనకు  వైస్రాయ్ ఘటన గుర్తుకు వచ్చిందని చెప్పుకొచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్. చంద్రబాబు నాయుడు అంటే తనకు గౌరవం ఉందని ఆ గౌరవాన్ని తగ్గించుకోవద్దని సూచించారు. 

ఎన్నికలకు ఇంకా సమయం ఉందని అప్పటి వరకు ఓపిక పట్టాలని సూచించారు. 40 ఏళ్లకు జగన్ తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారని చంద్రబాబు ఇప్పటి వరకు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని కానీ జగన్ లా సంస్కారం నేర్చుకోలేదని విమర్శించారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు తన గౌరవాన్ని తగ్గించుకోకుండా ఉండాలని కోరారు. 

ప్రజల సొమ్ముతో అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయని వాటిపై చర్చించాలని అందుకు అంతా సహకరించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. 

ap assembly: చంద్రబాబుకు ఇంగ్లీష్ అర్ధం కావడం లేదేమో.. జగన్ సెటైర్లు...

కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని తాను పోరాటం చేస్తే తనకు అడుగడుగునా చంద్రబాబు అడ్డుపడ్డారని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదాయే ముద్దు అంటూ తాను విశాఖపట్నంలో నిరసన దీక్ష చేస్తే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని బెదిరించారని గుర్తు చేశారు. 

ప్రత్యేక హోదా కోసం వైసీపీకి చెందిన ఎంపీలు రాజీనామా చేస్తే తాను కూడా చేద్దామని సూచిస్తే చేయోద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేస్తానని చెప్తే చేయ్ ఉప ఎన్నికలు పెడతానంటూ హెచ్చరించింది వాస్తవం కాదా అంటూ చంద్రబాబును నిలదీశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకు లేదని తెగేసి చెప్పారు అవంతి శ్రీనివాస్. మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారని అలాంటి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సాక్షి పేపర్, సాక్షి ఛానెల్ పై ఎందుకు ఆంక్షలు విధించారని నిలదీశారు.

ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ సాక్షి పేపర్ పై ఎంతలా అక్కసు వెళ్లగక్కారో అందరికీ తెలుసునన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను చంద్రబాబు ఉన్మాది అనడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు.

చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అది సరికాదన్నారు. సభలో వైసీపీ సభ్యులను రెచ్చగొట్టి ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆ ప్రయత్నాలు ఫలించవన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. 
నన్ను ఎంతలా ఏడిపించావ్: మగధీర సినిమా డైలాగ్ చెప్తూ చంద్రబాబుపై రోజా పంచ్ లు..

click me!