ఏపీలో కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో సర్కార్ ఆక్సిజన్ కొరతపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ ఎంత..? ఏ మేరకు సరఫరా వుందనే అంశంపై కసరత్తు చేస్తోంది. రాష్ట్రానికి పీక్ స్టేజ్‌లో ఏ మేరకు ఆక్సిజన్ అవసరమవుతుందో అంచనా వేస్తున్నారు
ఏపీలో కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో సర్కార్ ఆక్సిజన్ కొరతపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ ఎంత..? ఏ మేరకు సరఫరా వుందనే అంశంపై కసరత్తు చేస్తోంది. రాష్ట్రానికి పీక్ స్టేజ్‌లో ఏ మేరకు ఆక్సిజన్ అవసరమవుతుందో అంచనా వేస్తున్నారు అధికారులు.
ఏపీలో కోవిడ్ కేసులు పీక్ స్టేజ్‌లోకి వస్తే సుమారు 200 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుందని అంచనా వేశారు వైద్యాధికారులు. ప్రస్తుతం రోజుకు 80 నుంచి 100 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుందని అంచనా వేసిన అధికారులు.. ఏపీకి నాలుగు ప్రాంతాల నుంచి ఆక్సిజన్ రప్పించేలా ప్రణాళికలు వేస్తున్నారు.
undefined
విశాఖ స్టీల్ ప్లాంట్, భువనేశ్వర్, బళ్లారి, చెన్నై నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. విశాఖ నుంచి 80, భువనేశ్వర్ 70 టన్నుల ఆక్సిజన్ సరఫరా కానున్నాయి. ఇప్పటికే ఆక్సిజన్ సరఫరా ప్రారంభించింది విశాఖ స్టీల్ ప్లాంట్.
Also Read:గుంటూరు: కోర్టులో 12 మందికి కరోనా.. బాధితుల్లో న్యాయమూర్తులు
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. మంగళవారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు సంభవించాయి. యాక్టివ్ కేసులు మళ్లీ 50 వేలు దాటేశాయి.
గడిచిన ఒక్క రోజు వ్యవధిలో 37,922 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఏకంగా 8,987 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. సోమవారంతో పోలిస్తే ఒక్క రోజు వ్యవధిలోనే 3 వేలకు పైగా కేసులు అధికంగా నమోదవ్వడం పరిస్ధితి తీవ్రతకు అద్దం పడుతోంది.