ఏపీ సచివాలయంలో కరోనా కలకలం... మరో ఉద్యోగి మృతి

By Arun Kumar P  |  First Published May 27, 2021, 10:39 AM IST

 కరోనాతో బాధపడుతూ ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ ఓ సచివాలయ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. 


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో సచివాలయ ఉద్యోగి మరణించాడు. కరోనాతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు. 

ఏపీ సచివాలయంలోని మున్సిపల్ శాఖ విభాగంలో  ఏఎస్‌వోగా పనిచేసే శంకరప్ప ఇటీవల కరోనా బారినపడ్డాడు. కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన వెంటనే ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరి చికిత్స నిమిత్తం చేరారు. అయితే ఇలా కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ వస్తూ ఇవాళ(గురువారం) మృత్యువాతపడ్డారు. 

Latest Videos

undefined

read more  కరోనా వైద్యానికి లక్షలకు లక్షలు... ప్రైవేట్ హాస్పిటల్స్ పై జగన్ సీరియస్

ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. గత రెండు, మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు నిన్న(బుధవారం) భారీగా పెరిగాయి. దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. కర్ఫ్యూతో పాటు ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా కేసులు పెరగడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఏపీలో కొత్తగా 18,285 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 16,27,390కి చేరుకుంది.  ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 99 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10,427కి చేరుకుంది.

 ఇక కోవిడ్ బారినపడి విజయనగరం 9, ప్రకాశం 8, అనంతపురం 8, తూర్పుగోదావరి 8, చిత్తూరు 15, గుంటూరు 5, కర్నూలు 6, నెల్లూరు 8, కృష్ణ 5, విశాఖపట్నం 8, శ్రీకాకుళం 5, పశ్చిమ గోదావరి 14 మంది చొప్పున మరణించారు.

 ఒక్కరోజు కరోనా నుంచి 24,105 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 14,24,859కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 91,120 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,88,40,321కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,92,104 మంది చికిత్స పొందుతున్నారు.

 ఒక్కరోజు అనంతపురం 1876, చిత్తూరు 1822, తూర్పుగోదావరి 3296, గుంటూరు 1211, కడప 877, కృష్ణ 652, కర్నూలు 1026, నెల్లూరు 1159, ప్రకాశం 1056, శ్రీకాకుళం 1207, విశాఖపట్నం 1800, విజయనగరం 639, పశ్చిమ గోదావరిలలో 1664 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.
 
 

 

click me!