పోలవరం నిర్మాణంలో మరో అద్భుతం... గోదావరి ప్రవాహం 6.5కిమీ మళ్లింపు (వీడియో)

By Arun Kumar PFirst Published May 27, 2021, 9:48 AM IST
Highlights

పోల‌వ‌రం స్పిల్ వే నుంచి ఈ వర్షాకాలంలోనే వరదనీరు మళ్ళించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు నీటిపారుదల అధికారులు. 

పోల‌వ‌రం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్ రికార్డులను నమోదు చేసింది. తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్ పనుల్లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. తాజాగా గోదావరి నదీ ప్రవాహ మళ్ళింపు పనులను మొదలుపెట్టింది నిర్మాణ సంస్థ. నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుండి కుడివైపుకు మళ్ళిస్తున్నారు. ఎడమవైపు నుండి కుడివైపుకు దాదాపు 6.5 కి.మీ నదీ ప్రవాహాన్ని మళ్ళిస్తున్నారు. 

ఇలా పోల‌వ‌రం స్పిల్ వే నుంచి ఈ వర్షాకాలంలోనే వరదనీరు మళ్ళించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎగువ కాఫ‌ర్ డ్యాం నిర్మాణం పూర్తి స్దాయిలో సిద్దం చేసింది నిర్మాణ సంస్ద. గోదావ‌రికి అడ్డుక‌ట్ట వేయ‌డం ఇంజ‌నీరింగ్ అద్భుతం అంటున్నారు నిపుణులు. 

read more  పోలవరం నిర్మాణంలో జగన్ సర్కార్ ముందడుగు.. కీలక అంకం పూర్తి

ఈ సీజన్ నుండే గోదావరి నీటిని స్పిల్ వే నుండి విడుదల చేయనున్నట్లు నీటిపారుదల అధికారులు తెలిపారు. ముందుగా రివర్ స్లూయిజ్ గేట్లను ఎత్తి గోదావరి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ వర్షాకాలంలో వచ్చే వరద నీటిని స్పిల్ వే రేడియల్ గేట్లను ఎత్తి ఉంచడం ద్వారా దిగువకు విడుదల చేస్తారు. ఇప్పటికే 14 రేడియల్ గేట్లను పైకి ఎత్తి  సిద్దంగా ఉంచిన అధికారులు మిగతా గేట్లను ఎత్తి ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

వీడియో

 

 

click me!