Bus Accident In Prakasam : ఏపీలో మ‌రో పెను ప్ర‌మాదం .. అప్ర‌మ‌త్తంతో త‌ప్పిన ముప్పు

By Rajesh K  |  First Published Dec 16, 2021, 7:33 AM IST

ఏపీలోని మరో బస్సు ప్రమాదం జ‌రిగింది. ప్ర‌కాశం జిల్లాలోని  పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్దకు రాగానే…ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ప్ర‌యాణీకులు అప్ర‌మ‌త్తం కావ‌డంతో  ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఓ ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుండి చీరాలకు వస్తోంది. షార్టు సర్క్యూట్ తో బస్సులో మంటలు చెలరేగాయి.
 


Bus Accident In Prakasam : ఆంధ్రప్ర‌దేశ్ లో మ‌రో బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగింది. నిన్న ప్రకాశం జిల్లాలో జంగారెడ్డిగూడెం సమీపంలోని జ‌రిగిన ప్ర‌మాదంలో డ్రైవ‌ర్ తో స‌హా పది మంది ప్ర‌యాణీకులు మృత్యువాత ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా..ప్రకాశం జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ప్రైవేటు బస్సులో (Private bus) మంటలు (Fire) చెలరేగాయి. అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌యాణీకులు వెంట‌నే బ‌స్సు నుంచి దూకేశారు. దీంతో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా తప్పించుకున్నారు. కానీ ఈ ప్ర‌మాదంలో బస్సు పూర్తిగా దగ్ధమయింది.

ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి చీరాల వెళ్తున్నది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున తిమ్మరాజుపాలెం వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన బస్సు డ్రైవర్‌ ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో అంతా బస్సులోని నుంచి దూకి ప్రాణాలకు కాపాడుకున్నారు. బస్సు మొత్తం అగ్నికి ఆహుతయింది. అయితే ప్రయాణికుల లాగేజ్ బ‌స్సులోనే ఉండి పోవ‌డంతో బస్సులోనే కాలి బూడిదయింది.

Latest Videos

undefined

Read also: West Godavari Bus Accident : బస్సు పర్ఫెక్ట్.. మానవ తప్పిదమే వల్లే ప్రమాదం : అధికారులు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, షార్ట్‌ సర్య్కూట్‌ (short circuit) కారణంగా మంటలు చెలరేగినట్లు బస్సు సిబ్బంది వెల్లడించారు.ఈ ప్రమాదం నుంచి కొత్త మంది తేరుకోలేక పోతున్నారు. తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్ర‌మాద స‌మయంలోబస్సులో 8 మంది ప్రయాణికులు, ముగ్గురు బస్సు సిబ్బంది ఉన్నారు.

Read Also: PM Modi Ex Gratia: ఆ ప్ర‌మాదం చాలా బాధ‌క‌రం.. బాధిత కుటుంబానికి ప్ర‌ధాని న‌ష్ట‌ప‌రిహారం

మ‌రోవైపు.. నిన్న పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కూ ప‌ది మంది మృతి చెందారు.  మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉండ‌టం విచార‌కం. మరో 13 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.  బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాల‌కు  రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ ను జగన్ ఆదేశించారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోడీ కూడా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల‌కు ప్ర‌గాఢ సంతాపాన్ని ప్ర‌క‌టించారు. బాధిత కుటుంబానికి రెండు ల‌క్ష‌ల చోప్పున న‌ష్ట‌ప‌రిహ‌రం అందించ‌నున్న‌ట్టు ప్ర‌ధాని కార్యాల‌యం ప్ర‌క‌టించింది.

click me!