నెల్లూరు నేతల మధ్య విబేధాలపై జగన్ ఫోకస్: నేడు సీఎంతో భేటీ కానున్న అనిల్, కాకాని

By narsimha lodeFirst Published Apr 20, 2022, 1:35 PM IST
Highlights

పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. నెల్లూరు జిల్లాకు చెందిన నేతల విబేధాలపై జగన్ ఫోకస్ పెట్టారు. మాజీ మంత్రి అనిల్ కుమార్, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిల మధ్య విబేధాలపై ఫోకస్ పెట్టారు.ఈ ఇద్దరు నేతలపై జగన్ చర్చించనున్నారు.

అమరావతి: పార్టీలో నేతల మధ్య చోటు చేసుకొన్న విబేధాలను పరిష్కరించేందుకు వైసీపీ చీఫ్, ఏపీ సీఎం YS Jagan పోకస్ పెట్టారు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలపై సీఎం జగన్ కేంద్రీకరించారు.

ఏపీ మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ తర్వాత కొందరు YCP ప్రజా ప్రతినిధులు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసంతృప్తులను బుజ్జగించారు. అసంతృప్తులను పిలిపించుకొని సీఎం జగన్ మాట్లాడారు. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం నేతలు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహించారు.  Nellore జిల్లా నుండి మంత్రివర్గంలోకి Kakani Govardhan Reddy కి జగన్ చోటు కల్పించారు. అయితే గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో తనకు కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ మేరకు సహకరించారో అంతకు రెండింతలు సహకరిస్తానని మాజీ మంత్రి Anil kumar చెప్పారు. అన్నట్టుగానే అనిల్ కుమార్ నెల్లూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నెల్లూరు జిల్లాకు కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చిన రోజునే  మాజీ మంత్రి అనిల్ కుమార్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అంతేకాదు నెల్లూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్లెక్సీలను కూడా తొలగించారు. అయితే తన ఫ్లెక్సీలను కూడా నగరంలో ఏర్పాటు చేయని విషయాన్ని మాజీ మంత్రి అనిల్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అంతేకాదు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వైరి వర్గంగా ఉన్న వారితో కూడా వరుసగా మాజీ మంత్రి అనిల్ కుమార్ సమావేశాలు నిర్వహించడం కూడా కలకలం రేపింది. ఈ పరిణామాలను వైసీపీ నాయకత్వం సీరియస్ గా తీసుకొంది. ఈ నెల 17న వైసీపీ ముఖ్య నేతలు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి, మాజీ మంత్రి అనిల్ కుమార్ కు ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ క్రమశిక్షణను దాటొద్దని హెచ్చరించారు.

నెల్లూరు జిల్లాలో పరిణామాలను సీరియస్ గా తీసుకొన్న సీఎం జగన్ ఆ జిల్లా నేతలతో మాట్లాడాలని నిర్ణయం తీసుకొన్నారు.  మాజీ మంత్రి అనిల్ కుమార్ ను ఇవాళ తాడేపల్లిక రావాలని కోరారు. సీఎం జగన్ తో అనిల్ కుమార్ భేటీ కానున్నారు. మరో వైపు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా సీఎం జగన్ తో ఇవాళే భేటీ కానున్నారు. ఈ మేరకు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా సీఎం అపాయింట్ మెంట్ కోరారు.  మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సీఎం అపాయింట్ మెంట్ ఇచ్చారు. వీదిద్దరి మధ్య విబేధాల పరిష్కారం కోసం జగన్ ప్రయత్నించనున్నారు.

click me!