నగదు కష్టాలు ఇంకా తీరలేదు : బాబు

First Published Jul 13, 2018, 11:33 AM IST
Highlights

2018-19  సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  శుక్రవారం నాడు  విడుదల చేశారు. 1,94,220 కోట్లతో రుణ ప్రణాళికను ప్రకటించింది ఏపీ సర్కార్

అమరావతి:   ఒక లక్షా 94 వేల 220 కోట్లతో  వార్షిక రుణ ప్రణాళికను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు విడుదల చేశారు.  అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబునాయుడు  ఈ మేరకు వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు.  వ్యవసాయరంగానికి రాష్ట్ర ప్రభుత్వం ల,01,564 కోట్లను కేటాయించింది. 

ప్రాధాన్యత రంగాలకు రూ.44వేల 220 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత   నగదు కష్టాలు ఇంకా తీరలేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ప్రతి నెలా  పెన్షన్ మంజూరు చేసేందుకు అవసరమైన డబ్బులను సమకూర్చాలని తాను ప్రతి నెలా బ్యాంకర్లను కోరుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఏటీఎం మిషన్లలో నగదు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. నగదు కష్టాలు తీర్చేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని బాబు  కోరారు.

click me!