నెల్లూరు జిల్లా భూ సేకరణ కేసు: ఐదుగురు ఐఎఎస్‌లకు ఏపీ హైకోర్టులో ఊరట

By narsimha lodeFirst Published Sep 23, 2021, 2:55 PM IST
Highlights


నెల్లూరు జిల్లాలో భూ సేకరణ కేసులో ఐదుగురు ఐఎఎస్‌లకు ఏపీ హైకోర్టు ధర్మాసనంలో ఊరట లభించింది. కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ధర్మాసనం సస్పెండ్ చేసింది.

అమరావతి:  నెల్లూరు (nellore) జిల్లాలో 2015 నాటి భూసేకరణకు(land acquisition) సంబంధించిన  కోర్టు ధిక్కార కేసులో పలువురు ఐఏఎస్‌(IAS) అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో  (Andhra Pradesh High court) గురువారం నాడు ఊరట లభించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌లపై సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలను డివిజన్‌ బెంచ్‌ సస్పెండ్‌ చేసింది. బాధితులకు ఇప్పటికే పరిహారం అందినట్లు ఐఏఎస్‌లకు కోర్టుకు తెలపడంతో ఈ కేసులో తీర్పును సస్పెండ్‌ చేస్తూ డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. 

2015 నాటి భూసేకరణకు సంబంధించిన  కోర్టు ధిక్కార కేసులో పలువురు ఐఏఎస్‌ అధికారులకు కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది.  చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌కు నాలుగు వారాల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా ప్రస్తుత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌సింగ్‌ రావత్‌కి నెలరోజుల జైలు, రూ.2వేల జరిమానా  అప్పటి జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజుకు రెండు వారాల జైలుశిక్ష, రూ.1000 జరిమానా అప్పటి మరో కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు ప్రస్తుత కలెక్టర్‌ ఎన్‌వీ చక్రధర్‌లకు రూ.2వేల చొప్పున జరిమానా విధించింది. 

 

click me!