ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న విశాఖ యాత్రికులు: కాపాడాలని వేడుకోలు

By narsimha lodeFirst Published Sep 28, 2022, 11:28 AM IST
Highlights

ఉత్తరాఖండ్ లోని ఆదికైలాస్ యాత్రకు వెళ్లి 9 మంది విశాఖ వాసులు అక్కడే చిక్కుకున్నారు.తమను కాపాడాలని వారు కోరుతున్నారు. 

విశాఖపట్టణం: ఉత్తరాఖండ్ లో ఆదికైలాస్ యాత్రకు వెళ్లిన విశాఖకు చెందిన యాత్రికులు అక్కడే చిక్కకున్నారు. తమను కాపాడాలని వారు అధికారులను కోరతున్నారు. విశాఖపట్టణంలోని స్టీల్ ప్లాంట్ ఏరియాకు చెందిన తొమ్మిది మంది యాత్రికులు ఆదికైలాస్ యాత్రకు వెళ్లారు. గంజిసెవెంత్  గ్రనేడియర్స్  వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో  వీరు అక్కడే చిక్కుకున్నారు. కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తమను కాపాడాలని ఆదికైలాస్ యాత్రకు వెళ్లిన విశాఖ వాసులు కోరుతున్నారు. గతంలో కూడా ఉత్తరాఖండ్ కు వెఁళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు అక్కడే చిక్కుకున్న ఘటనలు నెలకొన్నాయి. 

ఉత్తరాఖండ్ లో పలు దేవాలయాల దర్శనం కోసం వెళ్లిన పలువురు యాత్రికులు 2018 మే మాసంలో చిక్కుకున్నారు. ఏపీ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్టణం తదితర ప్రాంతాల నుండది 39 మంది యాత్రికులు చార్ థామ్ యాత్రకు వెళ్లారు. భారీగా కొండచరియలు విరిగిపడడంతో వీరు ప్రయాణీస్తున్న మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఈ విషయాన్ని బాధితులు తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.  ఉత్తరాకండ్ లో చిక్కుకున్న వారిని క్షేమంగా స్వంత రాష్ట్రానికి తీసుకు వచ్చారు. 

2013 లో కూడా ఉత్తరాఖండ్ లో  3 వేల మంది యాత్రికులు చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా రాష్ట్రానికి రప్పించారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆ సమయంలో ఉత్తరాఖండ్ సీఎంతో ఫోన్ లో మాట్లాడి తమ రాష్ట్రానికి చెందిన యాత్రికులను సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు హెలికాప్టర్లను తెప్పించి చిక్కుకుపోయిన యాత్రికులను స్వరాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి తెలిపారు

click me!