ఆ కార్యక్రమానికి మంత్రులకు అందని ఆహ్వానం.. ఎమ్మిగనూర్, ఆదోని మున్సిపల్ కమిషనర్లకు నోటీసులు..

By Sumanth KanukulaFirst Published Sep 28, 2022, 10:36 AM IST
Highlights

కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్, ఆదోని మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఓ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించనందుకు వివరణ కోరుతూ కలెక్టర్ ఈ నోటీసులు జారీ చేశారు. 

కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్, ఆదోని మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల పరిధిలో జరిగిన టిడ్కో ఇళ్ల ప్రారంభ కార్యక్రమానికి మంత్రులను ఆహ్వానించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని వివరణ కోరుతూ ఎమ్మిగనూర్, ఆదోని మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. 

Also Read: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు సంస్థల దూకుడు.. సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసిన ఈడీ

ఇక, ఈ నెల 23న  కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారులోని జగనన్న నగర్‌లోని నిర్మించిన 2,000 టిడ్కో గృహాలు, ఎమ్మిగనూరులో 3,792 టిడ్కో ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలను రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్‌ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారుకు తాళాలు, ఇంటి పత్రాలు అందజేశారు.


 

click me!