చెత్త పన్ను కట్టకుంటే పెన్షన్‌ సొమ్ము కట్‌!.. అక్కడ అధికారుల అత్యుత్సహం

Published : Feb 06, 2022, 10:53 AM ISTUpdated : Feb 06, 2022, 10:57 AM IST
చెత్త పన్ను కట్టకుంటే పెన్షన్‌ సొమ్ము కట్‌!.. అక్కడ అధికారుల అత్యుత్సహం

సారాంశం

చెత్తపై వేసిన పన్నును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వం మాత్రం ఇది పెద్ద భారం కాబోదని చెబుతోంది. అయితే కొన్ని చోట్ల చెత్త పన్ను వసూలు విషయంలో అధికారులు అత్యుత్సహం ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది.

చెత్తపై వేసిన పన్నును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి పలువురు నిరసనలు కూడా వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇది పెద్ద భారం కాబోదని చెబుతోంది. అయితే కొన్ని చోట్ల చెత్త పన్ను వసూలు విషయంలో అధికారులు అత్యుత్సహం ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది. చెత్త పన్ను చెల్లించని వారి కుటుంబంలో పింఛనుదార్లు ఎవరైనా ఉంటే.. వారికి ఇచ్చే పెన్షన్‌ నుంచి ఆ సొమ్ముని కట్‌ చేయాలని కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులు వాలంటీర్లు ఆదేశిస్తున్నారు. 

ఇలాంటి ఘటన తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని బోరంపాడులో చోటుచేసుకుంది. ఇంటి పన్నులు చెల్లించలేదనే కారణంతో వృద్దులకు ఇచ్చే పింఛన్‌లో రూ. 200 తగ్గించి ఇచ్చారు. దీంతో అవ్వతాతలు షాక్ తింటున్నారు. సంక్షేమ పథకాలు ఏమొచ్చినా.. వాలంటీర్లు ఇంటి పన్ను, చెత్త పన్ను, ఓటీఎస్‌ వంటి వాటికి వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. 

తమకు ఎంతో ఆధారంగా ఉన్న పింఛన్ డబ్బుల నుంచి చెత్త పన్ను, ఇంటి పన్ను, నీటి పన్నుల వసూలు చేయడమేమిటని అవ్వాతాతలు, వితంతువులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొన్నిచోట్ల పింఛను డబ్బులకు కూడా వలంటీర్లు చిల్లులు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటోందని కొందరు విమర్శిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు